Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను ఇలా చేసి తాగితే.. నాజూకైన న‌డుము మీ సొంత‌మ‌వుతుంది..!

Sabja Seeds : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత ఊబ‌కాయం స‌మ‌స్య త‌లెత్తుతోంది. అధిక బ‌రువు కార‌ణంగా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డాలి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం, వ్యాయామాలు చేయ‌డం, మందులు వాడ‌డం వంటి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు.

అయితే కొంద‌రు ఎన్నిర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ బరువు మాత్రం త‌గ్గ‌రు. అలాంటి వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు స‌బ్జా గింజ‌ల నీటిని తాగ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గుతారు. స‌బ్జా గింజ‌ల‌ను ఆంగ్లంలో చియా సీడ్స్ అంటారు. ఇవి బరువు త‌గ్గ‌డంలో అద్భుతంగా ప‌ని చేస్తాయి. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును క‌రిగించ‌డంలో వీటికి ఏవీ సాటి రావు. ఇవి శ‌రీరంలో పేరుకుపోయిన చెడుకొవ్వును తొల‌గించి మంచి కొవ్వు ఏర్ప‌డేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌రిగేలా చేస్తాయి.

take Sabja Seeds in this way for quick reduction of fat
Sabja Seeds

స‌బ్జా గింజ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక శ‌రీంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డం సుల‌భ‌మ‌వుతుంది. అంతేకాకుండా జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డంలో కూడా వీటిలో ఉండే ఫైబ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌బ్జా గింజ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుస్తాయి. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు క‌డా స‌బ్జా గింజ‌లు ఎంతగానో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని తీసుకోవడం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. స‌బ్జా నీటిని ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటిని ఎలా ఉప‌యోగించాలి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక గిన్నెలో స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని అందులో నీటిని పోయాలి. త‌రువాత ఈ గింజ‌ల‌ను అర‌గంట పాటు నాన‌బెట్టాలి. స‌బ్జా గింజ‌లు నానిన త‌రువాత తెల్ల‌గా త‌యార‌వుతాయి. త‌రువాత ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌ల‌ను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వేసి క‌ల‌పాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని తాగాలి. ఈ విధంగా త‌యారు చేసుకున్న‌ స‌బ్జా నీటిని తాగ‌డం వ‌ల్ల వేగంగా బ‌రువు త‌గ్గుతార‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా స‌బ్జా నీటిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గి నాజుకుగా త‌యార‌వుతారు. ఈ స‌బ్జా గింజ‌ల‌ను సూప్ ల‌లో, స‌లాడ్స్ లో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా బ‌రువు తగ్గి ఆరోగ్యంగా త‌యార‌వుతారు.

D

Recent Posts