హెల్త్ టిప్స్

చలికాలంలో వెచ్చదనం కోసం ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి..!

మంచు కురిసే చలికాలం మొదలైంది. సాయంత్రం అవుతుందంటే చాలు నిండా కప్పుకుని పడుకోవాలని అనిపిస్తుంది. ఏవైనా వేడివేడి పదార్థాలు తినాలనిపిస్తుంది. ఈ సీజన్‏లో కొన్ని ఆహార పదార్థాలను రోజూవారీ మెనూతో కలిపి తీసుకోవడం వలన శరీరాన్ని వేడిగా కూడా ఉంచుకోవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ సీజన్‌లో ముతక తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలతో చేసిన సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సాయపడతాయి. చలికాలంలో మన శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఇతర సీజన్లలో కంటే శీతాకాలంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటానికి కారణం కూడా ఇదే.

చలికాలం ప్రారంభం నుంచి ఆహారంలో మొక్కజొన్న, జొన్న, బజ్రా, రాగులను చేర్చుకోవాలి. వీటిని ఉపయోగించి గంజి, రోటీ, దోస వంటి పదార్థాలను చేసుకొని తింటుండాలి. ఇవి మన శరీరం బరువును నియంత్రించడంతోపాటు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ సీజన్‌లో చాలా రకాల కూరగాయలు లభిస్తుంటాయి. అందుకని వివిధ కూరగాయలతో సూప్ తయారు చేసుకుని తీసుకోవడం చాలా మంచిది. వీటిలో నల్ల మిరియాల పొడిని చేర్చడం వల్ల మరింత ఉపయోగం పొందవచ్చు. మెంతికూర, బచ్చలికూర, ఆవాలు వంటి పచ్చి కూరగాయలు తీసుకోవాలి.

take these foods in winter for heat in body

లంచ్ లేదా డిన్నర్ కోసం ఏదో ఒక రూపంలో వీటిని తినడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే టీ లేదా క్యారెట్ పాయసం వంటి వాటిలో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం అలవాటు చేసుకోవాలి. చలికాలంలో చెమట రాదని చాలా మంది నీరు తక్కువగా తాగుతుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. అందుకే చలికాలం అయినప్పటికీ నిత్యం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. నీరు తక్కువగా తాగడం మన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

Admin

Recent Posts