హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటా జ్యూస్‌ను తాగండి.. 30 రోజుల్లో ఈ 5 అద్భుతాలు జ‌రుగుతాయి..!

ట‌మాటాల‌ను మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. అస‌లు ట‌మాటాల‌ను వేయకుండా వంట అనేది పూర్తి కాదు. దాదాపుగా ప్ర‌తి కూర‌లోనూ మ‌నం ట‌మాటాల‌ను వేస్తుంటాం. ట‌మాటాలు వేస్తే చికెన్‌, మ‌ట‌న్ కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఇక ట‌మాటాల‌ను నేరుగా కూర‌, ప‌ప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో చేస్తే లొట్ట‌లేసుకుని మ‌రీ తింటారు. అయితే ట‌మాటాలను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో చాలా మందికి తెలుసు. కానీ వీటిని రోజూ తినాలంటే కాస్త క‌ష్టంగానే ఉంటుంది. అయితే వీటిని తినేందుకు బ‌దులుగా వీటి జ్యూస్‌ను తాగ‌వ‌చ్చు.

ట‌మాటాల‌కు చెందిన జ్యూస్‌ను రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో స‌హా తీసుకోవాలి. రోజూ ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ట‌మాటాల్లో 95 శాతం వ‌ర‌కు నీరే ఉంటుంది. అలాగే విట‌మిన్లు బి6, సిల‌తోపాటు పొటాషియం కూడా ట‌మాటాల్లో అధికంగా ఉంటుంది. ట‌మాటా జ్యూస్‌ను తాగితే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మ‌న ఇమ్యూనిటీని పెంచుతాయి. ముఖ్యంగా ట‌మాటాల్లో లైకోపీన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేసి క‌ణాల‌ను ర‌క్షిస్తుంది. క‌నుక ట‌మాటా జ్యూస్‌ను రోజూ తాగాలి.

why we must take tomato juice daily

ట‌మాటాల్లో ఉండే లైకోపీన్ క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ట‌మాటాల్లో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ వ‌చ్చే చాన్స్ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ట‌మాటాల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఇలా ట‌మాటా జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక త‌ప్ప‌కుండా తాగండి.

Admin

Recent Posts