herbal tea ఉదయం నిద్రలేవగానే గొంతులో వేడి వేడి చాయ్ పడకపోతే కొందరికి అసలు రోజు ప్రారంభం కాదు. ఉదయాన్నే టీ తాగకుండా కొందరు ఏ పనీ ప్రారంభించారు. అయితే టీ లలో రక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పదార్థాలతో టీ తయారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో లాభాలు కలుగుతాయి. మరి ఆ వెరైటీ టీ లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. అల్లం టీ herbal tea
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల అల్లం టీని తయారు చేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు తగ్గుతాయి.
2. లెమన్ టీ
నిమ్మకాయలను మనం రోజూ ఏదో రూపంలో వాడుతుంటాం. వీటితో టీ herbal tea తయారు చేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
3. మందార పువ్వుల టీ
మందార పువ్వుల్లో యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ పువ్వులతో టీ తయారు చేసుకుని తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే రక్తం వృద్ధి చెందుతుంది.
4. పుదీనా టీ
పుదీనా ఆకుల టీని తాగితే శరీరానికి తాజదనం లభిస్తుంది. ఉత్సాహం వస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
5. కమోమిల్ టీ
కమోమిల్ (గడ్డి చామంతి) పువ్వుల టీని తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట ఈ టీని సేవిస్తే నిద్ర చక్కగా పడుతుంది.