Guava Leaves Water : జామ ఆకుల క‌షాయం.. ఎన్నో రోగాల‌కు ఔష‌ధం..!

Guava Leaves Water : జామ చెట్టు.. మ‌న‌కు అందుబాటులో ఉండే చెట్ల‌ల్లో ఇది ఒక‌టి. దీనిని మ‌నం ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు. పూర్వ‌కాలంలో ఇంటికి ఒక జామ చెట్టు ఉండేది. జామ చెట్టు నుండి వ‌చ్చే జామ కాయ‌ల‌ను మ‌నం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. జామకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. కేవ‌లం జామ కాయ‌లే కాకుండా జామ ఆకులు కూడా మ‌నం రోగాల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న‌కు వ‌చ్చే అనేక రోగాల‌ను న‌యం చేయ‌డంలో జామ ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ప్ర‌తి దానికి మందుల‌ను వాడ‌డానికి బ‌దులుగా మ‌న ఇంట్లో ఉండే జామ ఆకుల‌ను ఉప‌యోగించి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. జామ ఆకుల వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌స్తుత కాలంలో డెంగ్యూ జ్వ‌రం బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ జ్వ‌రం బారిన ప‌డిన‌ప్పుడు మ‌న ర‌క్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య త‌గ్గుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. ర‌క్తంలో ఉండే ఈ ప్లేట్ లెట్స్ ను పెంచే శ‌క్తి జామ ఆకుల‌కు ఉంటుంది. 9 జామ ఆకులను తీసుకుని 5 క‌ప్పుల నీటిలో వేసి మూడు క‌ప్పులు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక్కో క‌ప్పు చొప్పున మూడు పూట‌లా డెంగ్యూ జ్వ‌రం బారిన ప‌డిన వ్య‌క్తికి ఇస్తూ ఉండాలి. ఇలా చేయ‌డం వల్ల చాలా త్వ‌ర‌గా ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.

wonderful health benefits of Guava Leaves Water
Guava Leaves Water

జామ ఆకుల‌తో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 8 నుండి 10 లేత జామ ఆకుల‌ను తీసుకుని వాటిని ఒక లీట‌ర్ నీటిలో వేసి 10 నిమిషాల పాటు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఈ నీటిని నేరుగా తాగ‌వ‌చ్చు లేదా తేనెను క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఇలా జామ ఆకుల‌ను మ‌రిగించిన నీటితో డికాష‌న్ ని కూడా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. జామ ఆకుల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో జామ ఆకుల క‌షాయం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రాత్రి ప‌డుకునే ముందు జామ ఆకుల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

జామ ఆకుల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. అంతేకాకుండా ఈ క‌షాయాన్ని తాగ‌డం వల్ల శ‌రీరంలో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాల‌న్నీ తొల‌గిపోతాయి. అలాగే శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగి బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. జామ ఆకుల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డి అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ జామ ఆకుల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి.

ఆక‌లి త‌క్కువ‌గా ఉన్న వారు లేత జామ ఆకుల‌ను బాగా న‌మిలి ర‌సాన్ని మింగుతూ ఉంటే ఆక‌లి పెరుగుతుంది. వ‌ర్షాకాలంలో మ‌నం వైర‌స్, బాక్టీరియాల వల్ల ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ జామ ఆకుల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ వంటి ఇన్ ఫెక్ష‌న్‌ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ విధంగా జామ ఆకులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts