Pearl Millets : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అయితే సజ్జలను నేరుగా తినలేమని అనుకునేవారు వాటితో వివిధ రకాల వంటలను చేసి తినవచ్చు. వాటిల్లో సేమ్యా కూడా ఒకటి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సజ్జలతో సేమ్యా తయారీకి కావల్సిన పదార్థాలు..
సజ్జ పిండి – 150 గ్రాములు, గోధుమ పిండి – 50 గ్రాములు, ఉప్పు – చిటికెడు, నీళ్లు – 125 ఎంఎల్.
సజ్జల సేమ్యాను తయారు చేసే విధానం..
గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్లలో పైన తెలిపిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. వచ్చిన పిండి ముద్దను సేమ్యా గొట్టంలో పెట్టుకుని ప్టాస్టిక్ కవర్ మీద ఒత్తుకోవాలి. వీటిని 2-3 రోజులు ఆరనివ్వాలి. దీంతో సజ్జల సేమ్యా తయారవుతుంది. ఈ సేమ్యాతో ఉప్మా చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా సజ్జలను నేరుగా తినలేని వారు వాటితో సేమ్యాను తయారు చేసుకుని దాంతో ఉప్మా చేసి తినడం వల్ల ఎన్నో పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.