ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా అస్స‌లు వ‌ద‌ల‌కండి.. అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి..!!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల మూలికల్లో నేలతాడి ఒకటి. వీటి దుంపల చూర్ణాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు విరివిగా ఉపయోగిస్తారు. నేలతాడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా అస్స‌లు వ‌ద‌ల‌కండి.. అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి..!!

1. నేలతాడి దుంపల చూర్ణాన్ని పూటకు 10 గ్రాముల చొప్పున తీసుకుని అంతే మోతాదులో తేనె కలిపి తినాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయాలి. అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి.

2. నేలతాడి దుంపల చూర్ణం అర టీస్పూన్‌, అంతే మోతాదులో గోమూత్రంతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. అనేక రకాల జ్వరాలు తగ్గుతాయి.

3. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్‌ నేలతాడి దుంపల చూర్ణం కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది.

4. నేలతాడి దుంపల చూర్ణం అర టీస్పూన్‌ తీసుకుని దాన్ని అరగ్లాస్‌ పాలలో కలిపి రోజుకు రెండు సార్లు తాగితే స్త్రీలలో రొమ్ముల్లో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

5. నేలతాడి దుంపల చూర్ణం టీస్పూన్‌, టీస్పూన్‌ నెయ్యి కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.

6. నేలతాడి దుంపల చూర్ణాన్ని టీస్పూన్‌ మోతాదులో రోజుకు రెండు సార్లు కొబ్బరినీళ్లతో తీసుకుంటుండాలి. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

7. ఈ దుంపల చూర్ణం అర టీస్పూన్‌ తీసుకుని దాంతో కొద్దిగా నువ్వుల నూనె కలిపి తీసుకుంటుంటే శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు, ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

8. నేలతాడి దుంపల చూర్ణం, సైంధవ లవణంలను ఒక టీస్పూన్‌ మోతాదులో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. డయాబెటిస్‌ తగ్గుతుంది.

9. ఒక గ్లాస్‌ మజ్జిగలో ఒకటీస్పూన్‌ నేలతాడి దుంపల చూర్ణం కలిపి రోజుకు రెండు సార్లు తాగుతుంటే రక్తహీనత తగ్గుతుంది.

10. కొబ్బరినీళ్లలో కొద్దిగా నేలతాడి దుంపల చూర్ణం కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి.

Admin

Recent Posts