Beauty Tips : అందంగా కనబడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు తగ్గి ముఖం తెల్లగా, అందంగా కనబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవి తాత్కాలికమైన ప్రయోజనాలను మాత్రమే ఇస్తాయి. ఇంటి చిట్కాలను ఉపయోగించి మన చర్మాన్ని శాశ్వతంగా తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండానే సహజంగా మనం మన చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
చర్మం రంగును శాశ్వతంగా తెల్లగా మార్చే ఇంటి చిట్కా ఏమిటి.. ఇందులో ఉపయోగించే పదార్థాల గురించి.. అలాగే ఈ చిట్కాను ఎలా పాటించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా మనం ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పాలను తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును, ఒక టీ స్పూన్ బాదం నూనెను వేసి అన్ని కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దూది సహాయంతో ముఖానికి రాస్తూ 5 నుండి 10 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి.
ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇందులో ఉపయోగించిన పచ్చి పాలు, కలబంద గుజ్జు, బాదం నూనె.. ఇలా ప్రతిదీ కూడా మన చర్మాన్ని సంరక్షించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, మృతకణాలు తొలగిపోతాయి. చర్మం రంగు తెల్లగా మారడమే కాకుండా, ముఖం అందంగా, కాంతివంతంగా కూడా కనబడుతుంది.
ఈ మిశ్రమాన్ని కేవలం ముఖంపైనే కాకుండా మెడ, చేతులు, పాదాలు వంటి ఇతర శరీర భాగాలపై ఉండే చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా తక్కువ ఖర్చులో సహజంగానే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా శాశ్వతంగా చర్మం రంగును తెల్లగా మార్చుకోవచ్చు.