Boondi Curry : బూందీతో కూరను ఎలా త‌యారు చేయాలో తెలుసా ? భ‌లే రుచిగా ఉంటుంది..!

Boondi Curry : మ‌నం ర‌క‌ర‌కాల చిరు తిళ్ల‌ను తింటూ ఉంటాం. మ‌నం తినే ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ల్లో బూందీ కూడా ఒక‌టి. బూందీ చాలా రుచిగా ఉంటుంది. ఈ బూందీని మ‌నం ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే ఇది మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ బూందీని మ‌నం నేరుగా తింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ బూందీతో ఎంతో రుచిగా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. బూందీతో కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బూందీ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బూందీ – ఒక క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్న‌గా తరిగిన ట‌మాట ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, ప‌సుపు- చిటికెడు, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

here it is how to make Boondi Curry very easy
Boondi Curry

బూందీ కూర త‌యారీ విధానం..

ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌సుపు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా కూడా వేసి క‌లపాలి. త‌రువాత‌ మూత పెట్టి ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా ఉడికించాలి.

ట‌మాట ముక్క‌లు పూర్తిగా ఉడికిన త‌రువాత నీళ్ల‌ను పోసి క‌లిపి నూనె పైకి తేలే వ‌ర‌కు నీళ్ల‌ను మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత బూందీని వేసి క‌లిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ కూర త‌యార‌వుతుంది. ఈ బూందీ కూర‌ను అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా రుచిగా బూందీ కూర‌ను చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts