Black Marks On Nose : ముఖమంతా అందంగా ఎటువంటి మచ్చలు లేకుండా ఉన్నప్పటికీ కొందరిలో ముక్కు మీద నల్ల మచ్చలు ఉంటాయి. వీటి వల్ల ఎటువంటి సమస్య లేనప్పటికీ ముఖం అందవిహీనంగా కనబడుతుంది. ముక్కు మీద ఉండే ఈ నల్ల మచ్చలని ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా తొలగించుకోవచ్చు. నల్ల మచ్చలను తొలగించి ముఖాన్ని అందంగా మార్చే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం కీరదోస జ్యూస్ ను, పెరుగును, రోజ్ వాటర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కీరదోస జ్యూస్ ను, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను, ఒకటేబుల్ స్పూన్ పెరుగును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కుపై బాగా రుద్దుతూ మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముక్కుపై మచ్చలు తొలగిపోతాయి. ఇక రెండవ చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి రోజ్ వాటర్ ను, నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
దీని కోసం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను వేసి కలపాలి. తరువాత దీనిలో దూదిని ముంచి దానితో ముక్కుపై బాగా రుద్దాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల ముక్కుపై ఉండే నల్ల మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా కలబంద జెల్ ను ఉపయోగించి కూడా మనం ముక్కుపై ఉండే మచ్చలను తొలగించుకోవచ్చు. ఈ జెల్ ను కొద్దిగా తీసుకుని ముక్కుపై రాయాలి. 30 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన రీతిలో ముక్కుపై ఉండే మచ్చలన్నీ మటుమాయమవ్వడాన్ని గమనించవచ్చు.
రోజూ ఈ విధంగా చేయడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ముక్కుపై నల్ల మచ్చలతో బాధపడే వారు గ్లిసరిన్ ను ఉపయోగించి కూడా సమస్య నుండి బయటపడవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను, అర టేబుల్ స్పూన్ గ్లిసరిన్ ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కుపై రుద్దుతూ మర్దనా చేయాలి. ఇలా చేసిన పది నిమిషాల తరువాత నీటితో కడగాలి. పైన చెప్పిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ముక్కుపై ఉండే మచ్చలు అన్నీ తొలగిపోయి అందంగా కనబడతారు.