తెల్ల జుట్టు సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. వయస్సు మీద పడడం వల్ల సహజంగానే జుట్టు తెల్లబడుతుంది. కానీ కొందరికి యుక్త వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
1. ఆలివ్ ఆయిల్‌లో మన జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆలివ్ నూనెను వాడడం వల్ల దాదాపుగా అన్ని రకాల శిరోజాల సమస్యలు తగ్గుతాయి. అయితే జుట్టు నల్లబడాలంటే మాత్రం ఆలివ్ నూనెను జుట్టుకు బాగా మర్దనా చేసి ఒక గంట సేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 3 సార్లు చేస్తుండాలి. దీంతో తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది.
2. కొబ్బరినూనె మాత్రమే కాదు పచ్చి కొబ్బరిని నూరి పేస్ట్‌లా చేసి దాంతో తీసే పాలు కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆ పాలను తీసుకుని శిరోజాలుకు బాగా మర్దనా చేయాలి. తరువాత గంట సేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు నల్లగా మారుతుంది.
3. కరివేపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి జుట్టుకు మేలు చేస్తాయి. అందువల్ల కొన్ని కరివేపాకులను తీసుకుని నూరి పేస్ట్‌లా చేసి దాన్ని జుట్టుకు రాయాలి. గంట సేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాల సమస్యలు తగ్గుతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకలు నల్లగా మారుతాయి.
4. మెంతులతో మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటితో జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అందుకు గాను మెంతులను నీటితో నూరి పేస్ట్‌లా చేసి దాన్ని తలకు బాగా పట్టించాలి. గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయాలి. జుట్టు నల్లగా మారుతుంది.
5. మందార పువ్వులు జుట్టుకు ఎంతగానో మేలు చేస్తాయి. ఒంటి రెక్క మందార పువ్వులను సేకరించి పేస్ట్‌లా చేసి దాన్ని తలకు రాయాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో శిరోజాలు దృఢంగా మారుతాయి. ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు నల్లగా మారుతుంది.
ఈ చిట్కాలను తరచూ పాటిస్తుండడం వల్ల తెల్లగా ఉండే జుట్టును నల్ల రంగులోకి తేవచ్చు. అయితే ఫలితాలు మాత్రం త్వరగా రావని గుర్తుంచుకోండి. ఎక్కువ సార్లు ప్రయత్నిస్తే కచ్చితంగా ఫలితాలు వస్తాయి.