నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా ? మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..!

ప్రస్తుతం మన దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తోంది. అలాగే భారత్‌ బయోటెక్‌ సంస్థ కోవాగ్జిన్‌ను సరఫరా చేస్తుండగా, రష్యాకు చెందిన స్పుత్‌నిక్‌-వి వ్యాక్సిన్‌ను కూడా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.

నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా ? మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..!

అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్లకు గాను నకిలీలు పుట్టుకువస్తున్నాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే నకిలీ కోవిడ్‌ టీకాల పట్ల ప్రజలకు సూచనలు జారీ చేసింది. నకిలీ కోవిడ్‌ వ్యాక్సిన్లను ఎలా గుర్తించాలో కేంద్రం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అసలుదా, నకిలీదా ఇలా గుర్తించవచ్చు.

1. టీకా సీసాపై సీరమ్‌ సంస్తకు చెందిన లేబుల్‌ షేడ్‌ డార్క్‌ గ్రీన్‌ కలర్‌లో ఉంటుంది. అలాగే అల్యూమినియం ఫ్లిప్‌ ఆఫ్‌ కూడా డార్క్‌ గ్రీన్‌ కలర్‌లో ఉంటుంది. ఇలా ఉంటే అసలు కోవిషీల్డ్‌ టీకా అని అర్థం.

2. ఒరిజినల్‌ టీకాపై బ్రాండ్‌ నేమ్‌, ట్రేడ్‌ మార్క్‌లు మెన్షన్‌ చేయబడి ఉంటాయి.

3. స్పెషల్‌ వైట్‌ ఇంక్‌తో ప్రింట్‌ చేయబడిన అక్షరాలు క్లియర్ గా, చదవగలిగే విధంగా ఉంటాయి.

4. జనరిక్‌ నేమ్‌కు చెందిన టెక్ట్స్ ఫాంట్‌ సాధారణంగా ఉంటుంది. అన్‌ బోల్డ్‌లో ఉంటుంది. ఇలా ఉంటే అసలు వ్యాక్సిన్‌ అని అర్థం.

5. అసలు వ్యాక్సిన్‌పై CGS NOT FOR SALE అని ప్రింట్‌ చేయబడి ఉంటుంది.

6. సీరమ్‌ సంస్థకు చెందిన లోగో ఒక విభిన్నమైన యాంగిల్‌లో ప్రింట్‌ చేయబడి ఉంటుంది. ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తేనే అది కనిపిస్తుంది. అలా కనిపిస్తే కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అసలుదే అని అర్థం.

7. లేబుల్‌ మొత్తానికి ప్రత్యేకమైన స్పెషల్‌ హనీ కోంబ్‌ ఎఫెక్ట్‌ను ఇచ్చారు. దీని వల్ల ఒక నిర్దిష్టమైన యాంగిల్‌లోనే అది కనిపిస్తుంది.

కోవాగ్జిన్‌ టీకా అసలుదా, నకిలీదా ఇలా గుర్తించండి.

1. కోవాగ్జిన్‌ లేబుల్‌పై కనిపించని యూవీ హీలిక్స్‌ లేదా డీఎన్‌ఏ తరహా నిర్మాణం ఉంటుంది. అది కేవలం అల్ట్రా వయొలెట్‌ కాంతిలోనే కనిపిస్తుంది. అలా కనిపిస్తే అది అసలు టీకా అని అర్థం.

2. లేబుల్‌లో సూక్ష్మమైన టెక్ట్స్‌ కనిపించకుండా డాట్స్‌ రూపంలో ఉంటుంది. అది కోవాగ్జిన్‌ అని అర్థం వస్తుంది.

3. కోవాగ్జిన్‌లో ఎక్స్‌ మీద గ్రీన్‌ ఫాయిల్‌ ఎఫెక్ట్ కనిపిస్తుంది.

4. కోవాగ్జిన్‌ మీద హోలోగ్రాఫిక్‌ ఎఫెక్ట్ కనిపిస్తుంది.

స్పుత్‌నిక్‌ వి వ్యాక్సిన్‌లో నకిలీ, అసలును ఇలా గుర్తించండి.

1. టీకాలపై రెండు భిన్న రకాల లేబుల్స్‌ ఉంటాయి. వాటి మీద బల్క్‌ మానుఫాక్చరింగ్‌ కంపెనీలకు చెందిన వివరాలు ఉంటాయి. మానుఫాక్చరర్‌ పేరు ఒకటి మారుతుంది. మిగిలిన వివరాలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఇలా ఉంటే అది అసలు వ్యాక్సిన్‌ అని అర్థం.

2. స్పుత్‌నిక్‌ వ్యాక్సిన్‌కు చెందిన కార్టన్‌పై మాత్రమే ఇంగ్లిష్‌ లేబుల్స్‌ ఉంటాయి. వ్యాక్సిన్‌ మీద రష్యా అక్షరాలు ఉంటాయి.

ఈ విధంగా అసలు, నకిలీ కోవిడ్‌ టీకాలను గుర్తించవచ్చు.

Admin

Recent Posts