Curd For Hair : పెరుగుతో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది..!

Curd For Hair : ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌ని మీకు తెలుస్తా…. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. జుట్టు ఒత్తుగా పెర‌గాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. అలాగే జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు కూడా. మార్కెట్ లో ల‌భించే అనేక ర‌కాల నూనెల‌ను, షాంపుల‌ను వాడుతూ ఉంటారు.

కానీ ఎటువంటి ఫ‌లితం లేక చివ‌రికి నిరాశే మిగులుతుంది. జుట్టు విప‌రీతంగా రాలే వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. దీనిని వాడ‌డం వల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా పెరుగుతుంది. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక క‌ప్పు పెరుగును, ఒక టీ స్పూన్ కాళోంజి విత్త‌నాల పొడిని, 2 టీ స్పూన్ల ఆముదాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి వాడిన ప్ర‌తి ప‌దార్థం కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను, పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి.

Curd For Hair use that in this way
Curd For Hair

ఇవి జుట్టు కుదుళ్ల‌కు బ‌లాన్ని చేకూర్చి జుట్టు రాల‌డం త‌గ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో కాళోంజి విత్త‌నాల పొడిని, ఆముదం నూనెను వేసి బాగా క‌లపాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుద‌ళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు పెరుగుద‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ కూడా చ‌క్క‌గా అందుతాయి. జుట్టు కుదుళ్లు బ‌లంగా మారి జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అలాగే చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా త‌క్కువ ఖ‌ర్చులో జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts