Thimmirlu : శ‌రీరంలో ఎక్క‌డైనా స‌రే తిమ్మిర్లు బాగా వ‌స్తున్నాయా.. అయితే ఏం చేయాలంటే..?

Thimmirlu : రోజూ ఒక టీ స్పూన్ ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే చాలు మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈ మిశ్ర‌మం ఏంటి అని ఆలోచిస్తున్నారా దీనిని క‌టోరా, క‌టీరా అని పిలుస్తారు. అలాగే దీనిని గోంధ్, బూరుగు బంక‌, బూరుగు క‌టీరా అని కూడా పిలుస్తారు. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఒక‌వేళ తెలిసినా కూడా దీని వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయని తెలిసి ఉండ‌దు. అస‌లు క‌టోరా వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. దీనిని ఎలా ఉప‌యోగించాలి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క‌టోరా చూడ‌డానికి చిన్న చిన్న రాళ్ల లాగా ఉంటుంది. దీనిని బూరుగ చెట్టు బంక నుండి త‌యారు చేస్తారు. ఈ క‌టోరా మ‌న‌దేశంలో ఎక్కువ‌గా కాశ్మీర్ లో ల‌భిస్తుంది. దీనికి ఎటువంటి రుచి, వాస‌న ఉండ‌దు. ఈ క‌టీరాను ఎక్కువ‌గా ఆయుర్వేద ఔష‌ధాల్లో, సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్లో, న‌రాలకు సంబంధించిన ఔష‌ధాల త‌యారీలో దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు.

వేస‌వికాలంలో జ్యూస్ ల త‌యారీలో కూడా దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఈ క‌టోరాను ఉప‌యోగించాలి అనుకున్న‌ప్పుడు దీనిని నీటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యానికి క‌ల్లా ఈ క‌టీరా జెల్ లాగా మారుతుంది. ఇలా త‌యారైన జెల్ లో బెల్లం క‌లిపి నేరుగా తిన‌వ‌చ్చు. అలాగే దీనిని పాల‌ల్లో, నీళ్ల‌ల్లో, మ‌జ్జిగ‌లో అలాగే జ్యూస్ ల‌ల్లో క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఈ విధంగా క‌టీరాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గ‌ర్భిణీ స్త్రీలు కూడా దీనిని తీసుకోవ‌చ్చు. క‌టీరాను ఆవు నెయ్యిలో వేయిస్తే ఉబ్బుతుంది. ఇలా ఉబ్బ‌గానే దానికి కొద్దిగా ప‌టిక బెల్లాన్ని క‌లిపి ల‌డ్డూలాగా కూడా చేసుకోవ‌చ్చు. దీనిని గోంధ్ ల‌డ్డూ అని అంటారు. ఈ గోంధ్ ల‌డ్డూల‌ను బాలింత‌ల‌కు కూడా ఇవ్వ‌వ‌చ్చు. దీనిలో క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి.

if you are getting Thimmirlu then know what to do
Thimmirlu

గ‌ర్భిణీ స్త్రీలు, బాలింత‌లు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోషకాల‌న్నీ ల‌భిస్తాయి. వేసవి కాలంలో ఈ క‌టోరాను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎక్కువ‌గా ఈ క‌టీరాను వేస‌వికాలంలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అలాగే ఈ క‌టోరాలో వ‌య‌సును దాచే యాంటీ ఏజ‌నింగ్ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక దీనిని సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఈ క‌టీరాను ఫేస్ మాస్క్ లాగా కూడా ఉపయోగించ‌వ‌చ్చు. క‌టీరా జెల్ లో కొద్దిగా క‌ల‌బంద గుజ్జును క‌లిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు, గీత‌లు త‌గ్గుతాయి. ఈ క‌టీరాను ఏదో ఒక రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యంతో పాటు వీర్య క‌ణాల సంఖ్య కూడా పెరుగుతుంది.

అదే విధంగా మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డే వారు కూడా ఈ క‌టీరాను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. గాయాల‌పై ఈ క‌టీరాను రాయ‌డం వ‌ల్ల గాయాలతో పాటు గాయాల వ‌ల్ల క‌లిగే నొప్పులు కూడా త్వ‌ర‌గా మానుతాయి. క‌టీరా ఒక పెయిన్ కిల్ల‌ర్ లాగా ప‌ని చేస్తుంద‌ని అనేక ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు చేతులు, కాళ్ల‌ల్లో తిమ్మిర్లతో బాధ‌ప‌డే వారు, అరికాళ్ల‌ల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ క‌టీరాను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇవే కాకుండా క‌టీరాతో మ‌నం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts