Pulihora Paste : పులిహోర పేస్ట్‌ను ఇలా చేసి పెట్టుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు పులిహోర చేసుకోవ‌చ్చు..

Pulihora Paste : చింత‌పండు పులిహోర‌.. దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చింత పండు పులిహోర రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఈ పులిహోర‌ను మ‌నం త‌ర‌చూ త‌యారు చేస్తూనే ఉంటాం. చాలా మంది పులిహోర‌ను పేస్ట్ ను కూడా త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఈ పులిహోర పేస్ట్ తో చేసే పులిహోర కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా కాలం నిల్వ ఉండేలా పులిహోర పేస్ట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పులిహోర పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

చింత‌పండు – పావు కిలో, ప‌చ్చిమిర్చి – 25 నుండి 30, బెల్లం తురుము – 4 టీ స్పూన్స్, ఉప్పు – 50 గ్రా., క‌రివేపాకు – 4 రెబ్బ‌లు, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

Pulihora Paste recipe in telugu make instant pulihora
Pulihora Paste

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, జీడిప‌ప్పు – 8, ఇంగువ – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – ఒక టీ స్పూన్, పులిహోర పేస్ట్ – అర క‌ప్పు, అన్నం – ఒక క‌ప్పు బియ్యంతో వండినంత‌.

పులిహోర పేస్ట్ త‌యారీ విధానం..

ముందుగా చింత‌పండులో అర లీట‌ర్ నీళ్లు పోసి ఒక గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ చింత‌పండును ఒక క‌ళాయిలో వేసి చిన్న మంట‌పై మూత‌పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన చింత‌పండు కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత దాని నుండి రసాన్ని తీసుకోవాలి. ఈ చింత‌పండు ర‌సాన్ని క‌ళాయిలో తీసుకుని ఉడికించాలి. ఇందులోనే మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పేస్ట్ ను గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఆరు నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. మ‌నం ఎప్పుడంటే అప్పుడు ఇలా త‌యారు చేసుకున్న పులిహోర పేస్ట్ తో పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.

ఇలా త‌యారు చేసుకున్న పులిహోర పేస్ట్ తో పులిహోర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన త‌రువాత పులిహోర పేస్ట్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత అన్నాన్ని వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌పండు పులిహోర త‌యార‌వుతుంది. ఈ పులాహోర‌ను కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పులిహోర పేస్ట్ ను ఈ విధంగా త‌యారు చేసి పెట్టుకుని కావ‌ల్సిన‌ప్పుడు పులిహోర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts