Joint Pain Remedy : న‌డుము నొప్పి, కీళ్ల నొప్పి, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు.. అద్భుత‌మైన డ్రింక్‌.. ఇలా త‌యారు చేసి తాగాలి..

Joint Pain Remedy : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు స‌రిగ్గా న‌డ‌వ‌లేరు, కూర్చోలేరు. క‌నీసం వారి ప‌నుల‌ను కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. జీవ‌న విధానంలో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా తలెత్తే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం, రుమాటాయిడ్ ఆర్థ‌రైటిస్, ఆస్ట్రియో పోరోసిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న కీళ్ల‌ను క‌ద‌ల‌నీయ‌కుండా చేస్తాయి. వ‌య‌సు పై బ‌డ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు స‌హ‌జంగానే వ‌స్తాయి కానీ ప్రస్తుత కాలంలో ఈ స‌మ‌స్య న‌డి వ‌య‌స్కుల్లో కూడా వ‌స్తుంది. ప్ర‌ధానంగా మ‌న శ‌రీరంలో వ‌చ్చే వాత దోషాల కార‌ణంగా ఈ కీళ్ల వాతం, కీళ్ల నొప్పుల వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇలా వాత దోషాలు త‌లెత్త‌డానికి కార‌ణం మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే. వీటి కార‌ణంగా చాలా మంది మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు.

మ‌ల‌విస‌ర్జ‌న రోజుకు ఒక‌సారైనా సాఫీగా సాగ‌క క‌డుపులో వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు పేరుకుపోతున్నాయి. ఈ వ్య‌ర్థ ప‌దార్థాలు తిరిగి ర‌క్తంలో క‌లిసి పోతాయి. ర‌క్తంలో ఈ వ్యర్థాల మోతాదు పెరగ‌డం వ‌ల్ల మూత్ర పిండాలు వీటిని పూర్తిగా వ‌డ‌కట్ట‌లేవు. దీంతో యూరిక్ యాసిడ్ వంటి విష వ్య‌ర్థ ప‌దార్థాలు కీళ్ల‌ల్లో చేరి కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం, వాపు వంటి స‌మ‌స్యలు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా మారుతుంది. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డాలంటే మ‌న జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో మార్పు చేసుకోవాలి. మ‌న శ‌రీరంలో వాత దోషాల‌ను త‌గ్గించుకోవాలి. ఈ వాత దోషాలు త‌గ్గాలంటే మ‌నం జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుచుకోవ‌డం చాలా అవ‌స‌రం. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచే ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డంతో పాటు కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం కీళ్ల నొప్పుల స‌మ‌స్య నుండి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Joint Pain Remedy in telugu make this drink and take daily
Joint Pain Remedy

జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక‌టిన్న‌ర గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ వామును వేసి వేడి చేయాలి. వాము కీళ్ల నొప్పుల‌ను, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో కూడా ఈ వాము స‌హాయ‌ప‌డుతుంది. దీంతో చ‌ర్మం పై మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. వామును వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. ఇలా వామును వేసిన త‌రువాత ఇందులో బిర్యానీ ఆకును ముక్క‌లుగా చేసి వేయాలి. త‌రువాత ఈ నీటిని ఒక గ్లాస్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం తురుమును వేసి క‌ల‌పాలి.

అయితే షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ నీటిలో బెల్లానికి బ‌దులుగా బ్లాక్ సాల్ట్ ను వేసి క‌లుపుకోవాలి. ఈ పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున అలాగే రాత్రి ప‌డుకునే ముందు తీసుకోవాలి. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గి వాత దోషాలు తొల‌గిపోతాయి. ఈ పానీయాన్ని తీసుకోవ‌డంతో పాటు సూర్య‌ముద్ర వేయ‌డం వ‌ల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మ‌న ఉంగ‌రం వేలును మ‌ధ్య‌లోకి మ‌లిచి దానిపై బొట‌న వేలును ఉంచాలి. మిగిలిన వేళ్ల‌ను నిటారుగా ఉంచాలి. దీనినే సూర్య ముద్ర అంటారు. రెండు చేతుల‌తో ఈ సూర్య‌ముద్ర‌ను రోజూ 25 నిమిషాల పాటు వేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాతం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మాన‌సిక నిగ్ర‌హం పెరుగుతుంది. అలాగే అధిక ఒత్తిళ్ల వ‌చ్చే డ‌యాబెటిస్ కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ఈ విధంగా పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డంతో పాటు ఈ సూర్య ముద్ర‌ను వేయ‌డం వ‌ల్ల కీళ్ల సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts