Pudina Pulao Recipe : పుదీనా పులావ్ ను ఇలా చేశారంటే.. ఒక్క ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా తింటారు..

Pudina Pulao Recipe : మ‌నం వంటల్లో గార్నిష్ కొర‌కు అలాగే రుచి కొర‌కు ఉప‌యోగించే వాటిల్లో పుదీనా ఒక‌టి. పుదీనా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంట‌ల త‌యారీలో దీనిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి వాస‌న పెరుగుతంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. పుదీనాను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. వంట‌ల త‌యారీలో వాడ‌డ‌మే కాకుండా ఈ పుదీనాతో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట రాని వారు కూడా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేలా ఉండే ఈ పుదీనా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బాస్మ‌తీ బియ్యం – 100 గ్రా., పుదీనా పేస్ట్ – 50 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 5,యాల‌కులు – 4, సాజీరా – ఒక టీ స్పూన్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు – గుప్పెడు, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – 2 టేబుల్ స్పూన్స్.

Pudina Pulao Recipe in telugu best for breakfast or lunch
Pudina Pulao Recipe

పుదీనా పులావ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక దాల్చిన చెక్క‌, బిర్యానీ ఆకు, ల‌వంగాలు, యాల‌కులు, సాజీరా వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లను రంగు మారే వర‌కు వేయించిన త‌రువాత గ‌రం మ‌సాలా, ఉప్పు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత పుదీనా పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత పుదీనా ఆకుల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన బాస్మ‌తి అన్నాన్ని వేసి బాగా క‌ల‌పాలి.

త‌రువాత కొన్ని పుదీనా ఆకుల‌ను, ఫ్రైడ్ ఆనియ‌న్స్ ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. పుల్ల‌టి రుచి కావాల‌పుకునే వారు ఇందులో నిమ్మ‌ర‌సాన్ని కూడా వేసి క‌లుపుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా పులావ్ త‌యార‌వుతుంది. దీనిని చ‌ల్ల‌టి రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి అలాగే స్పెష‌ల్ డేస్ లో ఇలా పుదీనాతో ఎంతో రుచిగా ఉండే పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అంద‌రూ ఈ పులావ్ ను ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts