Muscle Cramps Remedies : నిద్ర పోతున్న‌ప్పుడు తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా ? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి.!

Muscle Cramps Remedies : నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డం. లేదంటే కాలి పిక్క‌లు కూడా కొంద‌రికి ప‌ట్టేస్తుంటాయి. సాధార‌ణంగా చాలా మందికి నిద్ర‌లో ఇలా జ‌రుగుతుంది. ఇక కొంద‌రికైతే రోజులో ఇత‌ర స‌మ‌యాల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీనికి కార‌ణాలు అనేకం ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండ‌డం, వ్యాయామం చేస్తున్న‌ప్పుడు, క్రీడ‌లు ఆడుతున్న‌ప్పుడు లేదా పోష‌కాహార లోపం వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా తొడ కండ‌రాలు లేదా పిక్క‌లు ప‌ట్టేస్తుంటాయి. అలాంటి స‌మ‌యాల్లో విప‌రీత‌మైన నొప్పి వ‌స్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. కానీ కింద తెలిపిన విధంగా కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు ప‌ట్టేసిన‌ప్పుడు ఆ ప్ర‌దేశంలో ఐస్ గ‌డ్డ‌లు క‌లిగిన ప్యాక్‌ను కొంత సేపు ఉంచాలి. నొప్పి త‌గ్గేంత వ‌ర‌కు ఇలా చేయాలి. దీంతో ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

2. కొబ్బ‌రినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెల‌ను స‌మ‌భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా చేసి దాన్ని వేడి చేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తూ సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో బిగుసుకుపోయిన కండ‌రాలు సాగుతాయి. నొప్పి త‌గ్గుతుంది.

Muscle Cramps Remedies follow these 5 tips
Muscle Cramps Remedies

3. కొబ్బ‌రినూనె కొంత తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేయాలి. అనంతం ఆ మిశ్ర‌మాన్ని వేడి చేయాలి. దీన్ని గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. సాధార‌ణంగా చాలా మందికి డీహైడ్రేషన్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. నీరు త‌గినంతగా తాగ‌క‌పోతే ఇలా జ‌రుగుతుంది. డీహైడ్రేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు తొడ కండ‌రాలు లేదా పిక్క‌లు ప‌ట్టేస్తాయి. అలాంట‌ప్పుడు త‌గిన‌న్ని నీరు తాగితే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

5. శ‌రీరంలో త‌గినంత‌గా పొటాషియం లేక‌పోయినా ఇలా జ‌రుగుతుంది. అలాంటి వారు పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టిపండ్లు త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకుంటే స‌మ‌స్య రాకుండా ఉంటుంది.

Editor

Recent Posts