Pippi Pannu : మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పన్ను సమస్య ఒకటి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. మనం తినే ఆహారంలో ఉండే చక్కెరలు దంతాలపై పేరుకుపోతాయి. దీంతో దంతాలపై బ్యాక్టీరియా అభివృద్ది చెంది పన్ను పుచ్చిపోతుంది. పిప్పి పన్ను వల్ల విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో వాపు కూడా వస్తూ ఉంటుంది. పిప్పి పన్ను పోటు మనిషికి ఒక నిమిషం కూడా కుదురు లేకుండా చేస్తుంది. పన్ను ఒక్కసారి పుచ్చిపోతే మరలా దానిని బాగు చేయడం కుదరని పని. ఎన్ని ఆహార పద్దతులు మార్చుకున్న దంతాలకు హాని చేసే ఎటువంటి ఆహారాన్ని తీసుకోకపోయిన కూడా ఇతర దంతాలు పుచ్చకుండా ఉంటాయి. కానీ ఇదివరకే పుచ్చిన దంతాలను మాత్రం బాగు చేయడం కుదరదు. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి, బాధ తగ్గుతుంది. అలాగే పిప్పి పన్ను ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటుంది.
కానీ పిప్పి పన్ను మాత్రం తిరిగి బాగుచేయడానికి రాదని నిపుణులు చెబుతున్నారు. పిప్పి పన్ను సమస్య తలెత్తగానే చాలా మంది పెయిన్ కిల్లర్ లను, యాంటీ బయాటిక్ లను వాడుతూ ఉంటారు. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుని వద్దకు వెళ్లి పిప్పి పన్ను తొలగించేసుకుంటున్నారు. వైద్యులు పిప్పి పన్ను భాగంలో మత్తు ఇంజెక్షన్ ను ఇచ్చి పన్నును తొలగిస్తున్నారు. మత్తు ఇంజెక్షన్ లేని రోజుల్లో పూర్వకాలంలో సహజ సిద్దంగానే పిప్పి పన్ను విరిగి వచ్చేలా చేసేవారు. పూర్వకాలంలో ఈ పద్దతినే ఎక్కువగా ఉపయోగించే వారు. ఈ పద్దతిని మనం కూడా ఉపయోగించవచ్చు. పిప్పి పన్ను సమస్య మరీ తీవ్రంగా ఉండి దానిని తీసివేయాల్సి వచ్చినప్పుడు ఇంగువను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి.
ఈ ముక్కలను పిప్పి పన్ను వల్ల కలిగిన గుంతలో ఉంచాలి. ఈ ముక్క కరిగే కొద్ది మరలా ఇంగువ ముక్కను ఉంచాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇలా ఇంగువను పిప్పి పన్ను గుంతలో ఉంచాలి. ఇలా 5 నుండి 10 రోజుల పాటు ఉంచడం వల్ల పిప్పి పన్ను దానంతట అదే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. పిప్పి పన్నును తీసివేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఈ చిట్కాను ఉపయోగించాలి. పన్ను కొద్దిగా పుచ్చినప్పుడు మాత్రం ఈ చిట్కాను ఉపయోగించకూడదు. పిప్పి పన్ను సమస్య మరీ తీవ్రమై దానిని తొలగించాల్సి వచ్చినప్పుడు ఈ చిట్కాను ఉపయోగించి సహజ సిద్దంగా పిప్పి పన్నును తొలగించుకోవచ్చు. బలవంతంగా పన్ను తీసేసే పని లేకుండా ఎటువంటి నొప్పి లేకుండా పిప్పి పన్ను సహజంగా తొలగించుకోవచ్చు.