Meal Maker Manchuria : మీల్ మేక‌ర్‌తోనూ మంచూరియా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Meal Maker Manchuria : సోయా చంక్స్.. సోయా గింజ‌ల‌తో చేసే ఈ సోయా చంక్స్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సోయా చంక్స్ (మీల్ మేక‌ర్‌)ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. సోయాచంక్స్ తో మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే పులావ్, బిర్యానీ వంటి వాటిల్లో కూడా వీటిని వాడుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ సోయా చంక్స్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే సోయా మంచురియాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సోయా మంచురియాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. సోయా చంక్స్ తో ఎంతో రుచిగా ఉండే సోయా మంచురియాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సోయా మంచూరియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సోయా చంక్స్ – ఒక క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ఉల్లిపాయ త‌రుగు – 2 టీ స్పూన్స్, ప‌చ్చిమిర్చి త‌రుగు – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగ‌ర్ – అర టీ స్పూన్, సోయా సాస్ – అర టీ స్పూన్, ట‌మాట కిచ‌ప్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 200 ఎమ్ ఎల్, అరోమాటిక్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – ఒక టేబుల్ స్పూన్.

Meal Maker Manchuria recipe in telugu very tasty easy to make
Meal Maker Manchuria

సోయా మంచురియా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక సోయా చంక్స్ ను వేసి ఉడికించాలి. సోయా చంక్స్ ఉడికిన త‌రువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వాటిపై చల్ల‌టి నీటిని పోసి క‌డ‌గాలి. ఇప్పుడు సోయా చంక్స్ ను నీరు అంతా పోయేలా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొద్దిగా ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా సిద్దం చేసుకున్న సోయా చంక్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో 3 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిత‌రుగు, ప‌చ్చిమిర్చి త‌రుగు, అల్లం త‌రుగు, వెల్లుల్లి త‌రుగు వేసి పెద్ద మంట‌పై వేయించాలి.

త‌రువాత చిల్లీ పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత వెనిగ‌ర్, సోయా సాస్, ట‌మాట కిచ‌ప్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు పొంగు వ‌చ్చిన త‌రువాత అరోమాటిక్ పౌడ‌ర్, మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన సోయా చంక్స్ ను వేసి క‌ల‌పాలి. వీటిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా మంచురియా త‌యార‌వుతుంది. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా లేదా ఏదైనా రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ఇంట్లోనే సోయా మంచురియాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ముఖ్యంగా పిల్ల‌లు వీటిని ఇష్టంగా తింటారు.

D

Recent Posts