చిట్కాలు

స్ట్రెచ్ మార్క్స్‌.. ఏం చేసినా పోవ‌డం లేదా..? ఈ 2 చిట్కాల‌ను ట్రై చేయండి..!

స్ట్రెచ్‌ మార్క్స్‌. మహిళలను బాగా ఇబ్బందికి గురిచేసే సమస్యల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా గర్బధారణ సమయంలో మహిళల పొట్టపై ఈ స్ట్రెచ్‌ మార్క్స్‌ వస్తాయి. ఇంతకూ స్ట్రెచ్‌ మార్క్స్‌ అంటే ఏంది అనుకుంటున్నారా? అదేనండీ పొట్టపై చారలు ఏర్పడటం. ఈ చారలు రావడం అనేది అనారోగ్య సమస్య కాకపోయినా.. తమ చర్మంపై అవి వికారంగా ఉన్నాయని మహిళలు బాధపడుతుంటారు.

అసలు ఈ స్ట్రెచ్‌ మార్క్స్‌ ఎందుకు వస్తాయంటే.. గర్బధారణ సమయంలో బిడ్డ పెరిగినాకొద్ది పొట్ట సాగుతుంది. దీంతో చర్మంపై చారలు ఏర్పడుతాయి. ప్రసవం తర్వాత పొట్టభాగం యథాస్థితికి వచ్చినా ఈ చారలు పోవు. ఈ చారల సమస్య మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ చారలను పోగొట్టుకోవడానికి వారు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. కొందరు వైద్యులను కూడా సంప్రదిస్తారు. అయినా ప్రయోజనం ఉండదు.

women follow these remedies to remove stretch marks

అయితే, ఇంతటి మొండి సమస్యను కేవలం కొన్ని వంటింటి చిట్కాలు పాటించడంతో పరిష్కరించుకోవచ్చట. ఎంతో మంది మహిళలు ఈ చిట్కాలు పాటించి సక్సెస్‌ అయ్యారట. మరి అవేంటో చూద్దాం. మొదటి చిట్కా.. స్నానానికి గంట ముందు ఆముదం నూనెను గోరువెచ్చగా చేసి చారలు ఉన్నచోట తైలమర్దన చేయాలట. తర్వాత గంటసేపటి స్నానం చేయాలట. ఇలా ప్రతిరోజు చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుందట.

రెండో చిట్కా.. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు బాదం నూనెతో చారలపై మర్దన చేసుకోవాలట. మరుసటి రోజు ఉదయాన్నే వేడి నీటితో స్నానం చేసి, చారలపై కలబంద గుజ్జు రాసుకోవాలట. ప్రతిరోజు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందట. చదివారుగా.. మరి ఈ చిట్కాలు పాటించి మీరు కూడా స్ట్రెచ్‌ మార్క్స్‌ను పోగొట్టుకునే ప్రయత్నం చేయండి.

Admin

Recent Posts