Pulipirlu : పులిపిర్ల సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మందే ఉంటారు. చర్మంపై బుడిపెలలా ఉండి చూడడానికి అంద విహీనంగా ఉంటాయి. ఇవి ముఖం, చేతులు, వేళ్లు అనే కాకుండా ఇతర శరీర భాగాలపై కూడా వస్తాయి. వీటి వల్ల మనకు ఎటువంటి హాని కలగదు. కానీ వీటి వల్ల మనం అప్పుడప్పుడూ ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. పులిపిర్ల గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇవి ఒక వైరస్ కారణంగా వస్తాయని, అలాగే ఈ పులిపిర్లు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. హ్యూమన్ పాలిలోమ అనే వైరస్ ఇన్ ఫెక్షన్ వల్ల మన చర్మంపై పులిపిర్లు వస్తాయి.
ఈ పులిపిర్లు ఉన్న వారు వాడిన వస్తువులను ఇతరులు ఉపయోగించడం వల్ల, పులిపిర్లను తాకి మరో చోట చర్మాన్ని తాకడం వల్ల పులిపిర్లు వ్యాప్తి చెందుతాయి. పులిపిర్లు ఉన్న వారి వస్తువులను ఉపయోగించకపోవడం, వాటిని తాకిన వెంటనే చేతులను శుభ్రపరుచుకోవడం వంటివి చేయడం వల్ల పులిపిర్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. వీటిని నిర్మూలించడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆయింట్ మెంట్లను రాయడం, వీటిని కత్తితో కోయడం, కత్తిరించడం వంటివి మనలోచాలా మంది చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇవి మరలా వస్తూనే ఉంటాయి.
ఆయుర్వేదం ద్వారా కూడా మనం ఈ పులిపిర్లను తొలగించుకోవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మేడి చెట్టును ఉపయోగించి మనం ఈ పులిపిర్ల సమస్య నుండి బయటపడవచ్చు. మేడి చెట్టు ఆకులను లేదా కాయలను కోయగా వచ్చిన పాలను పులిపిర్లు రాలి పోయే వరకు రోజూ రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పులిపిర్లకు కారణమయ్యే వైరస్ నశించి పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పాలను ఉపయోగించి మనం మొలల సమస్య నుండి కూడా బయట పడవచ్చు. మేడి చెట్టు పాలను మొలలపై రాస్తూ ఉండడం వల్ల కొద్ది రోజుల్లోనే మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ విధంగా మేడి చెట్టును ఉపయోగించి మనం పులిపిర్ల సమస్య నుండి, అదే విధంగా మొలల సమస్య నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.