చిట్కాలు

Yellow Teeth : ఎంత‌టి గార ప‌ట్టిన ప‌సుపు దంతాలు అయినా స‌రే.. ఇలా చేస్తే తెల్ల‌గా, ముత్యాల్లా మారుతాయి..!

Yellow Teeth : పసుపు రంగులోకి మారిన దంతాల‌తో మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. ఈ దంతాల కార‌ణంగా న‌లుగురితో స‌రిగ్గా మ‌ట్లాడ‌లేక‌, చ‌క్క‌గా న‌వ్వ‌లేక ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. దంతాలు ప‌సుపు రంగులోకి మార‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ధూమ‌పానం చేయ‌డం, దంతాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం, మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పంచ‌దార ఎక్కువ‌గా ఉండే శీత‌ల పానీయాల‌ను తాగ‌డం వంటి వివిధ ర‌కాల కార‌ణాల చేత దంతాలు ప‌సుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ప‌సుపు రంగులోకి మారిన ఈ దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌డానికి మ‌నం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే టూత్ పేస్ట్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ప‌సుపు రంగులో ఉండే దంతాలు తెల్ల‌గా మెరిసిపోతూ ఉంటాయి.

దంతాల‌ను తెల్ల‌గా మార్చే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అలాగే దీనిని ఎలా ఉప‌యోగించాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ముందుగా తెల్ల‌గా ఉండే ఒక టూత్ పేస్ట్ ను ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బ‌లను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసేసి మెత్త‌గా చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ ను కూడా గిన్నెలో వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత ఇందులో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో చిటికెడు ప‌సుపును వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల‌ను తెల్ల‌గా మార్చే పేస్ట్ త‌యార‌వుతుంది.

your yellow teeth become white if you do this

ఇప్పుడు ఈ పేస్ట్ ను ఎలా ఉప‌యోగించాలో తెలుసుకుందాం. ఇలా త‌యారు చేసుకున్న పేస్ట్ ను త‌ర‌చూ ఉప‌యోగించే పేస్ట్ వ‌లె ఉప‌యోగించాలి. అలాగే ఈ టూత్ పేస్ట్ ను ఉప‌యోగించేట‌ప్పుడు ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి వాటిని ఆపేయాలి. ఈ టూత్ పేస్ట్ ను బ్ర‌ష్ తో తీసుకుని 3 నుండి 4 నిమిషాల పాటు దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వెల్లుల్లితో టూత్ పేస్ట్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ప‌సుపుద‌నం తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా మార‌డంతో పాటు దంతాల స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. అలాగే చిగుళ్ల నుండి ర‌క్తం కారడం, చిగుళ్ల వాపు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. దంతాలు ప‌సుపు రంగులో ఉన్న వారు ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

Admin

Recent Posts