ఆధ్యాత్మికం

కొబ్బరికాయతో మంగళవారం ఇలా చేస్తే.. విజయం మీదే!

హిందూ సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాము. మంచి పనుల కోసం ముందుగా కొబ్బరి కాయను కొట్టి ఆ శుభకార్యాన్ని ప్రారంభిస్తాము. కొబ్బరికాయని శ్రీ ఫలం అని కూడా పిలుస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదని చెప్పవచ్చు. ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరికాయను ఉపయోగించి మన జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

మంగళవారం ఉదయం తలంటు స్నానం చేసి ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి హనుమంతుని పాదాల చెంత ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల మన జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయను కొట్టి ఎర్రని వస్త్రంలో చుట్టినటు కొబ్బరి కాయను తీసుకొని మన ఇంట్లో ఎవరికీ కనపడకుండా దాచి పెట్టాలి.

do this with coconut on tuesday for success

ఈ విధంగా కొబ్బరికాయ ఎవరికీ కనబడకుండా పెట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన లాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక శని దోషాలతో బాధపడే వారు సైతం ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయను అక్కడే ఉన్నటు నీటిలో పడేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts