vastu

Negative Energy Plants : ఈ మొక్క‌ల‌ను ఇంట్లో అస‌లు పెట్టుకోకండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే.. క‌ష్టాల పాల‌వుతారు..!

Negative Energy Plants : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి, మనం వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, ఎంతో మంచి జరుగుతుంది. మన ఇంట్లో ఎన్నో మొక్కలు ఉంటాయి. చాలా మందికి, మొక్కల్ని పెంచడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. మొక్కలు ఇంట్లో ఉంటే, ప్రశాంతత ఉంటుంది. పైగా, చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది. ఇంటి పరిసరాల్లో, ఇంటి లోపల చోటు ఎక్కడ ఉంటే అక్కడ, అందమైన మొక్కలు పెంచితే ఇల్లు చాలా బాగా కనపడుతూ ఉంటుంది. పచ్చని రంగు మొక్కలు ఇంట్లో ఉండడం వలన, మెదడు ఆహ్లాదానికి గురవుతుంది.

ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి హార్మోన్స్ ని, ప్రొడ్యూస్ చేస్తుంది. చాలామంది, ఇళ్లల్లో పూల మొక్కలు, మనీ ప్లాంట్ వంటి వాటిని అలంకరణ కోసం మొక్కలను ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, పెంచుతూ ఉంటారు. అయితే, ఈ మొక్కలు మాత్రం ఇంట్లో అసలు ఉండకూడదు. ఇటువంటి మొక్కలు ఉన్నట్లయితే, తొలగించడం మంచిది. కాక్టస్ మొక్క అసలు ఇంట్లో ఉండకూడదు. ఇది ముళ్ళతో ఉంటుంది.

Negative Energy Plants do not put them in your home

ఇది ఇంట్లో ఉండడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ఏదైనా పని మొదలు పెడితే, అది పూర్తి కాదు. కాబట్టి, ఇలాంటి ముళ్ళ మొక్కల్ని ఇంట్లో పెట్టకండి. బోన్సాయ్ మొక్కలని కూడా ఇంట్లో పెట్టకూడదు. బోన్సాయ్ మొక్కలు ఇంట్లో ఉండడం వలన సమస్యలు కలుగుతాయి. ఇటువంటి మొక్కలు ఎదుగుదలని ఆపేస్తాయి. చిన్న చిన్న బాంబు ప్లాంట్లు చాలా ఆకట్టుకునేలా కనబడుతుంటాయి.

బాంబు ప్లాంట్ లని లక్కీ బ్యాంబు ప్లాంట్లు అని కూడా అంటారు. చాలా మంది ఆఫీస్ టేబుల్స్ మీద కూడా వీటిని పెడుతూ ఉంటారు. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి. పత్తి చెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు. ఇది కూడా, నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది. దీని వలన కూడా సమస్యలు ఎదురవుతాయి.

Admin

Recent Posts