information

భార్య పేరిట ఆస్తి ఉంటే.. ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..?

చాలామంది, ఈరోజుల్లో తన భార్య పేరు మీద ఆస్తుల్ని కొంటున్నారు. సెలబ్రిటీలు కూడా ఇలానే చేస్తున్నారు. ప్రస్తుతము, ఇది చాలా కామన్ గా మారిపోయింది. ఈ విధానానికి గణనీయమైన ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశం మహిళలకు ప్రత్యేక పన్ను రాయితీలని కల్పిస్తున్నది. ఇది నూటికి నూరు శాతం నిజం. మీ భార్య పేరు మీద, మీరు ఆస్తిని కొనేటప్పుడు, మీరు ఆస్తికి సంబంధించిన పన్ను భారాన్ని, గణనీయంగా తగ్గించుకోవచ్చు. భార్య పేరు మీద ఆస్తి కొనడం వలన, ఈ బెనిఫిట్ ఉంటుంది.

అలానే, ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవేంటో కూడా ఇప్పుడు చూసేద్దాం. మీరు ఇల్లు కొనేటప్పుడు లేదంటే కట్టేటప్పుడు, మీ భార్య పేరు మీద లోన్ ఎంచుకోవడం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అలా చేస్తే, వడ్డీ రేటులో 0.05% తగ్గింపును పొందవచ్చు. కాబట్టి, భార్య పేరు మీద ఆస్తి కొనడం వలన, ఈ లాభం కూడా ఉంది. అలానే స్టాంప్ డ్యూటీకి సేవింగ్స్. అనేక రాష్ట్రాలలో మహిళల పేరు మీద, ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి ప్రబలంగా ఉన్నది.

స్టాంపు డ్యూటీలో తగ్గింపు ఉంటుంది. మీ భార్య రిజిస్టర్ ఓనర్ గా ఉన్నప్పుడు, రిజిస్ట్రేషన్ మొత్తం ఖర్చు చాలా తక్కువ ఉంటుందట. ఇలా, మీ భార్య పేరు మీద ఆస్తి కొనడం వలన ఈ సేవింగ్ కూడా ఉంటుంది. పైగా మహిళలకు సాధికారత కల్పించే మార్గం కూడా.

పన్ను రాయితీలు, తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు, తగ్గిన స్టాంప్ డ్యూటీ ఖర్చులు ఇలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, ఈసారి ఇల్లు కట్టేటప్పుడు కానీ లేదంటే ఏమైనా ఆస్తి ఎవరి పేరు మీద పెట్టాలన్న సందేహం ఉన్నప్పుడు కానీ, ఇటువంటి పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఫాలో అవ్వడం మంచిది. అప్పుడు కొంతలో కొంత ఆదా అవుతుంది.

Admin

Recent Posts