ఈ ఫోటోలోని వ్యక్తి పేరు విజయ్ ఠాకూర్. వయస్సు 62 సంవత్సరాలు. ఈయనొక రిటైర్డ్ ఇంజనీర్. 65000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఒక టాక్సీ డ్రైవర్ గా ఎందుకు మారాడో ఒక్కసారి చదవండి. విజయ్ ఠాకూర్ మాటల్లోనే.. గర్భవతిగా ఉన్న నా భార్యకు ఒక అర్ధ రాత్రి కడుపు నొప్పి గా ఉందని చెప్పింది. ఆ నొప్పితో ఎంతగానో తల్లడిల్లిపోయింది. ఆ రాత్రి వేళ ఆమెని ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి టాక్సీల కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఒక రోడ్డు ఇంకో రోడ్డు ఇలా చుట్టూ ఉన్న రోడ్ల వెంట పరిగెత్తాను. కానీ సమయానికి టాక్సీ దొరకని కారణ గా ఆమెకి గర్భస్రావం జరిగింది.
పండంటి బిడ్డ కోసం కలలు గన్న నా భార్య తీవ్ర దుఃఖం తో కుమిలిపోయింది. టాక్సీ కోసం నేను పడ్డ తాపత్రయం , బాధ కడుపు నొప్పితో విలవిల లాడిన నా భార్య పడ్డ కష్టం నన్ను ఎంతగానో కలచివేశాయి. ఇంకెవరూ ఇలాంటి బాధలు పడకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చి లార్సెన్ అండ్ టుబ్రో లో ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టాక్సీ నడపటం మొదలు పెట్టాను. ప్రాణాపాయంలో ఉన్న దాదాపు 500 మందిని ఇప్పటిదాకా నా కారులో ఆసుపత్రి తీసుకుని వెళ్ళాను. సాధారణ ప్రయాణీకుల ద్వారా నెలకి 10000 సంపాదిస్తున్నాను.
నా క్యాబ్ ఎక్కిన ప్రతి ప్రయాణీకుడికి నా కార్డు ఇస్తాను. అర్ధరాత్రి ,అపరాత్రి ఎప్పుడైనా ఫోన్ చెయ్యచ్చు అనిచెప్తాను. మెడికల్ ఎమర్జెన్సీ కి అసలు డబ్బే తీసుకోను. ఏ సమయం అయినా వస్తాననే చెబుతాను. ఉద్యోగంలో ఉంటే 65000 వచ్చేవి. కానీ అప్పుడు లేని సంతృప్తి, ఆనందం ఇప్పుడు లభిస్తున్నాయి అంటున్నాడీ 62 సంవత్సరాల రిటైర్డ్ ఇంజనీర్ విజయ్ ఠాకూర్. ఓసారి తీవ్ర గాయాలైన కుర్రాడిని సమయానికి ఆసుపత్రిలో చేర్చినందుకు ఎంత కావాలో చెప్పండి. ఎంతైనా ఇస్తాం అని అతడి తల్లిదండ్రులంటే చిరునవ్వు నవ్వి డబ్బునాశించి చేసేది సాయం ఎందుకవుతుంది, ఇది నా ఆత్మ తృప్తి కోసం చేస్తున్నాను అని సున్నితంగా తిరస్కరించాడు విజయ్ ఠాకూర్. హ్యాట్సాఫ్ టు విజయ్ ఠాకూర్.