lifestyle

భార్యాభర్త దూరంగా ఉన్నా శృంగార‌మా..? ఎలా..?

దూరంగా వున్న భార్యా భర్తలకు కలిసిన అనుభూతి నిచ్చేందుకు ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ కనిపెట్టారు. ఇది వారి సెల్ ఫోన్లలో వైబ్రేషన్లను సృష్టిస్తుంది. ఈ అప్లికేషన్ ఆపిల్ యాప్ స్టోర్ ఆమోదంకూడా పొందింది. ఆమె సెల్ లో వున్న రొమాంటిక్ యాప్ కు దగ్గరవాలంటే 5.49 డాలర్లు అదనపు బిల్లు అవుతుందట. ఇది మిలిటరీ భార్యాభర్తలకు తరచుగా ప్రయాణాలలో వుండే జంటలకు ఎంతో అనుకూలం అంటున్నారు.

భార్యా భర్తలు ఎంతో ప్రేమ కలిగి వుంటారు. అయితే వారి ఉద్యోగాలు వ్యాపారాలు వారిని దూరంగా వుంచుతాయి. అటువంటపుడు వారిద్దరూ సెల్ ఫోన్ లోనే వాస్తవమైన అనుభూతి తరంగాలు పొందాలంటే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగకరం అంటోంది ఈ వెబ్ సైట్. దీని ఫలితంగా వారి శృంగార జీవితం గొప్పగా వుండదుగాని, వారు దగ్గర దగ్గరగా వున్న భావనలేర్పడతాయట.

couple can do this type of sex even if they are far away from each other

దూరంలో వున్నప్పటికి ఆమెకుగల సెల్ వైబ్రేషన్లు నియంత్రించడం ద్వారా ఆమె అతని స్పర్శ పొందగలదంటున్నారు. ఈ స్పర్శ, నిదానం, లేదా గట్టిగా లేదంటే ఒక మాదిరిగా కూడా వుండగలదని ది డైలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంటోంది. ఈ అప్లికేషన్ తయారీదారు తాను దూరప్రాంత ప్రేమ సంబంధాలు మొదలుపెట్టినపుడు దీనిని కనిపెట్టినట్లు అమెరికా టెక్నాలజీ సైట్ మాషబుల్ తో పేర్కొన్నాడట. అయితే ఈ అప్లికేష‌న్ అంద‌రికీ ఎప్పుడు అంద‌బాటులోకి వ‌స్తుందో చూడాలి.

Admin