సాధారణంగా స్త్రీ పురుషుల సంబంధాలు వారి, వారికి గల ఆకర్షణలపై వుంటాయి. మరి మీ రూపం భాగస్వామికి ఆకర్షణీయంగా కనపడాలంటే, మీరు కొన్ని చర్యలు చేపట్టాలి. ఈ చర్యలను ఒక వెబ్ సైట్ తన సర్వేలో కనుగొని వెల్లడించింది. అవేమిటో పరిశీలించండి. మీరు పెట్టే తల యాంగిల్ మీ ఆకర్షణను చెపుతుందంటున్నారు వెబ్ సైట్ నిర్వాహకులు. మహిళ తన తలను వెనక్కి విరిస్తే, ఆమెలో మహిళాతనం తక్కువని తక్కువ ఆకర్షణ కలిగి వుంటుందని, తన గడ్డం క్రిందకు వంచితే మహిళాతనం అధికమని, రతి బాగా చేయగలదని చెపుతున్నారు. అయితే ఈ భంగిమలు పురుషులకు పూర్తిగా వ్యతిరేక ప్రభావం తెలుపుతాయని కనుగొన్నారు.
తల కనుక ముందుకు వంచితే, మగతనం తక్కువట. ఆకర్షణ కూడా తక్కువేనట. మీ ముఖానికి మరో ఆకర్షణ, మీ చిరునవ్వు. చాలామంది చిరునవ్వును అద్దంలో చూసి మరీ సాధన చేస్తారు. ఈ చిరునవ్వు మీ ప్రేయసికి ఆకర్షణగా వుండాలి. ఫొటోలకొరకు నవ్వుతాము. ఎవరినైనా కలిసినపుడు నవ్వుతాము. ఈ రకంగా మీలోని ఆకర్షణను బయటపెట్టుకోవచ్చు. ఇక ఎపుడూ నవ్వుతూండే పురుషులైతే, నవ్వునాపండి. మహిళలకైతే మంచి పలువరస అందాన్నిస్తుంది. జెనీవా యూనివర్శిటీ రీసెర్చర్ల పరిశోధన మేరకు మన రింగ్ ఫింగర్ మన ముఖ ఆకర్షణను తెలియజెపుతుందట.
రింగ్ ఫింగర్ కనుక బాగా పొడవుగా వుంటే మీలో టెస్టోస్టిరోన్ అధికంగా వున్నట్లు తేలింది. రింగ్ ఫింగర్ పొడవుగా వున్న పురుషుల్లో ఆకర్షణీయముఖం కూడా వుంటుందని తెలుస్తోంది. సాధారణంగా మహిళలు, ముఖంపై పెద్ద గాటు వున్న పురుషులకు ఆకర్షించబడతారట. ఆ రకంగా వున్న ముఖం బాగా ఆకర్షణీయం అని సర్వే చెపుతోంది. దానికి కారణం అతనిలో ధైర్య సాహసాలు బాగా వుంటాయని మహిళను, పిల్లలను ఎట్టి పరిస్ధితులలోనైనా సరే ఇటువంటి పురుషుడు బాగా రక్షిస్తాడని వారు భావిస్తారని వెబ్ సైట్ తెలిపింది.