వాహనాలపై సహజంగానే చాలా మంది రక రకాల స్టిక్కర్లను అతికిస్తుంటారు. కొందరు తమ పిల్లలు, కుటుంబ సభ్యులకు చెందిన పేర్లను రేడియం స్టిక్కర్ల రూపంలో అతికిస్తారు. కొందరు భిన్న రకాల డిజైన్లకు చెందిన స్టిక్కర్లను అతికిస్తారు. ఇక కొందరు దైవాలకు చెందిన స్టిక్కర్లను అతికిస్తారు. అయితే మనకు ఎక్కువ శాతం వాహనాలపై కింద చూపిన హనుమాన్ స్టిక్కర్ కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హనుమాన్ స్టిక్కర్‌ను నిజానికి కరణ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్ వేశారు. హనుమాన్ అంటే ఉగ్రరూపంలో ఉంటే బాగుంటుంది కనుక.. ఆయన అలా కోపంగా చూస్తున్నట్లు కరణ్ బొమ్మ గీశారు. అయితే ఓ కంపెనీ ఆ బొమ్మకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తామని, హక్కులను తమకు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ కరణ్ ఆచార్య అందుకు నిరాకరించారు.
ఈ హనుమాన్ బొమ్మను రాయల్టీ ఫ్రీ బొమ్మగా వేశానని, అందుకు డబ్బులు తీసుకోలేనని ఖరాఖండిగా చెప్పేశారు. ప్రజలందరూ ఈ బొమ్మను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అందుకనే చాలా మంది ఈ బొమ్మను వాహనాలపై స్టిక్కర్ రూపంలో వేసుకుంటున్నారు. ఇక హనుమాన్ అంటే మనకు ఎలాంటి ఆపదా రాకుండా చూసుకుంటాడు, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు కనుక చాలా మంది వాహనాలపై ఆయనకు చెందిన ఈ స్టిక్కర్‌ను అతికిస్తుంటారు. ఇదీ ఆ స్టిక్కర్‌కు చెందిన అసలు విషయం..!