lifestyle

దుబాయ్‌లో ఇన్ని రూల్స్ ఉంటాయా..? అందుక‌నే ఆ దేశం అంత అభివృద్ధి చెందింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను ఎవ్వరినీ ప్రేమించను అనుకున్నవాడు కూడా దుబాయ్ తో కచ్చితంతో ప్రేమలో పడిపోతాడు&period; ఇక్కడి పద్ధతులు&comma; రూల్స్&comma; టెక్నాలజీ&comma; ప్రతిదీ బాగా ఆకర్షిస్తాయి&period; దుబాయ్ ఓ మానవ నిర్మితమైన అద్భుతం&period; భారతదేశంతో సత్సంబంధాలు కలిగిన దేశం ఇది&period; ఇక్కడున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్&comma; టెక్నాలజీలను వాడుకుంటున్న విధానం ఇండియా మీద బాగా ప్రభావం చూపిస్తుంది&period; ఫాస్ట్ టాగ్ అలా అమల్లోకి వచ్చినదే&period; ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అనేది కొన్ని మతాల మధ్య ఉంటే&comma; ఇక్కడ మతాలతో పాటు దాదాపు 120 దేశాల వారు కలిసి ఉంటున్నారు&period; 50 కి పైగా భాషలు&period;&period; ఇక్కడా క్రైమ్ రేట్ ప్రపంచదేశాలన్నింటిలోకల్లా అత్యంత తక్కువ కావటానికి ఇక్కడ వాడబడుతున్న టెక్నాలజీలు ఒక కారణమైతే ఇక్కడి ఒక కనీవినీ ఎరుగని ఓ విచిత్రమైన రూల్ అత్యంత ముఖ్య కారణం&comma; ఆ రూల్ &&num;8211&semi; బతుకూ&comma; బతకనీ&period;&period;&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా విడ్డూరమైన రూల్ కదా&quest; ఇదే అక్కడ ఉన్న ఇండియన్స్ లో చాలామందికి నచ్చనిది&period; ఇక్కడ ఉన్న ఇండియన్స్ మెచ్చేది&period; కీబోర్డ్ వెనకాల కూర్చుని ఎవరిని పడితే వారిని కామెంట్ చేయటానికి ఇక్కడ అవకాశం లేదు&period; ఆడవాళ్లు వేసుకునే బట్టల గురించి వాగే హక్కు లేదు&period; సెలెబ్రెటీల గురించి&comma; వారి వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేసే హక్కు లేదు&period; రేప్ జరిగింది అంటే ఆడపిల్ల తప్పు కూడా ఉంది అని పబ్లిక్ గా కామెంట్ చేసి తప్పించుకునే అవకాశం ఇక్కడ దొరకదు&period; రోడ్ మీద&comma; పబ్లిక్ ప్లేసుల్లో కనిపించారు కదా అని సెలెబ్రిటీలను సెల్ఫీ అడగటం&comma; ఆటోగ్రాఫ్ అడగటం చేయకూడదు&period; అందుకే షారుఖ్ ఖాన్&comma; వివేక్ ఒబేరాయ్&comma; మహేష్ బాబు&comma; అల్లు అర్జున్ వంటి వారు హాయిగా తిరుగుతూ ఉంటారు&period; హీరోయిన్లు కూడా మాల్స్ లో మనలానే తిరుగుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80564 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;dubai-2&period;jpg" alt&equals;"dubai has so many rules that is why it is develpoed " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి 3 గంటలకు ఆడపిల్ల బయట ఉందేమిటి అని ఆమె వైపు చూసే హక్కు లేదు&comma; మాట్లాడే హక్కు లేదు&comma; కామెంట్ చేసే హక్కు లేదు&period; బురఖా వేసుకున్న వారితో అయినా&comma; మినీ స్కర్ట్ వేసుకున్న వారితో అయినా మర్యాదగానే మాట్లాడాలి&period; చేసినది చేసి&comma; నా వెనకెవరున్నారో తెలుసా అనే హక్కు లేదు&period; రాజకీయ నాయకులు లేరు&comma; కాబట్టి కులాల మతాల గొడవలు లేవు&comma; ఫ్రీ గా ఏదీ ఇవ్వరు&period; అధికార దుర్వినియోగానికి ఆస్కారం లేదు&period; ఏ మతానికి ఇక్కడ ప్రాముఖ్యత లేదు&comma; మతం పూర్తిగా వ్యక్తిగతం&period; ఏ మతం &lpar;ఇస్లాం అయినా సరే&rpar; తాలూకూ ప్రమోషన్స్ చేయటానికి లేదు&period; పండగలు సెలెబ్రెట్ చేసుకునేటప్పుడు పక్కవారికి డిస్టర్బ్ చేయనంత వరకూ ఏమైనా చేసుకోవచ్చు&period; రోడ్ మీద చిందులు వేయకూడదు&period; ట్రాఫిక్ ఆగేలా చేయటానికి లేదు&comma; రోడ్ బ్లాక్ చేసే హక్కు లేదు&period; నిరసనలకు ఆస్కారం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెలెబ్రిటీ పెళ్లి గురించి&comma; చావు గురించి&comma; విడాకుల గురించి మాట్లాడాల్సిన పని లేదు&comma; పెళ్లి&comma; చావు&comma; విడాకులు ఆయా ఫ్యామిలీల వ్యక్తిగత అంశాలే&period; నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకు&comma; నువ్వు బతుకు మరొకరిని బతకనీ&period;&excl;&excl; ఒకరి పెళ్లి&comma; ఒకరి చావు మీడియాలో టెలికాస్ట్ చేయకూడదు&period; వ్యక్తిగతం అంటే నిజంగానే వ్యక్తిగతం&period; ఇష్టం ఉన్నా లేకపోయినా అవతలి వ్యక్తి ఆడయినా మగయినా మర్యాద పూర్వకంగానే మాట్లాడాలి&period; చిత్రంగా ఇక్కడ పోలీసులు సాయం చేయటానికి ముందుకు వస్తారు&comma; పైగా అవినీతికి పాల్పడరు&period; నీ రూంలో&comma; నాలుగు గోడల మధ్య విచ్చలవిడిగా బతుకు&comma; కానీ పబ్లిక్ ప్లేసుల్లో సీన్ క్రియేట్ చేయకు&period; ఎవరికి కష్టం కలిగేలానో&comma; ఇబ్బంది కలిగేలానో నీ ప్రవర్తన ఉండకూడదు&period; హాయిగా బతుకు&comma; ఇక్కడ ఎన్నో ఉన్నాయి అనుభవించు&comma; ఒకరి ప్రయివసి కి భంగం కలిగించనీకు&period; చాలామంది అనుకుంటారు&comma; ఇక్కడ మరణ శిక్షల అమలు ఎక్కువ అని&period; అది అపోహ మాత్రమే&period; ఇక్కడ భారీ జరిమానాలు ఉంటాయి&comma; మరణ శిక్షలు&comma; జైలు శిక్షలు చాలా అరుదు&period; ఆ జరిమానాల భయమే మనిషిని జాగ్రత్తగా మసులుకునేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80563" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;dubai-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోడ్ మీద నీరు ఆగి ఉంది&comma; కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ నీరు పక్కన ప్లాట్ఫామ్ పై నడుస్తున్న వారిపై పడితే 20 వేల &lpar;4 లక్షల రూపాయలు&rpar; జరిమానా&period; అది తెలిశాక బుద్ధిగా డ్రైవ్ చేయరూ&quest; రోడ్ మీద వెళుతున్న సెలెబ్రిటీని&comma; ఆడపిల్లలను&comma; మగవారిని అయినా ఫోటో తీస్తే భారీ జరిమానా&period;&period; అది తెలిశాక మనిషి జాగ్రత్తపడడూ&quest; ఏ ఆడపిల్ల గురించయిన అసభ్యంగా మాట్లాడినట్టు రుజువైతే వారం రోజులు జైలు&comma; ఆ తర్వాత వారి దేశానికి డిపోర్ట్&period; ఏదో నాలుగు పైసలు సంపాదించుకుందాం అని వచ్చిన వాడు అంత రిస్క్ తీసుకుంటాడా&quest; ఇక్కడ అర్ధరాత్రులైన ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతారు&comma; భయం అనే పదానికి అర్థం తెలియనట్టుగా ఉంటుంది&period; ఎవరికి మర్దర్ల&comma; రాబరిలా భయం ఉండదు&comma; చివరకు ఎడారుల వైపు వెళ్లినా కూడా ఆడపిల్లలు బార్బీక్యూ చేసుకుంటూ చిందులు తొక్కుతూ కనిపిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదంతా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నేను ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన ఉన్నత స్థానంలో ఉండటమే గాక 15 సంవత్సరాలుగా నివసిస్తున్నాను&period; పరిశీలనా శక్తి ఎక్కువ&comma; పైగా రాత్రుళ్ళు పడుకునే అలవాటు బొత్తిగా లేకపోవటం ఇంకో కారణం&period; రోడ్లు బాగుంటాయి&comma; స్పీడ్ 120 దాటకూడదు&period; నేనుంటుంది హై-వె కి దగ్గర కాబట్టి 118–120 కి తక్కువ కొట్టను&period; ఇంటర్నెట్ లేని ప్రదేశం&comma; రాని ప్రదేశం లేదు&period; చుట్టుపక్కల ఉన్న షార్జా&comma; రస్ అల్ ఖైమ&comma; ఫుజైరా వంటి రాష్ట్రాలకు ఎప్పుడైనా వెళ్లి రావొచ్చు&period; ఎవరూ అడ్డుకోరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts