Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

దుబాయ్‌లో ఇన్ని రూల్స్ ఉంటాయా..? అందుక‌నే ఆ దేశం అంత అభివృద్ధి చెందింది..!

Admin by Admin
March 25, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేను ఎవ్వరినీ ప్రేమించను అనుకున్నవాడు కూడా దుబాయ్ తో కచ్చితంతో ప్రేమలో పడిపోతాడు. ఇక్కడి పద్ధతులు, రూల్స్, టెక్నాలజీ, ప్రతిదీ బాగా ఆకర్షిస్తాయి. దుబాయ్ ఓ మానవ నిర్మితమైన అద్భుతం. భారతదేశంతో సత్సంబంధాలు కలిగిన దేశం ఇది. ఇక్కడున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీలను వాడుకుంటున్న విధానం ఇండియా మీద బాగా ప్రభావం చూపిస్తుంది. ఫాస్ట్ టాగ్ అలా అమల్లోకి వచ్చినదే. ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అనేది కొన్ని మతాల మధ్య ఉంటే, ఇక్కడ మతాలతో పాటు దాదాపు 120 దేశాల వారు కలిసి ఉంటున్నారు. 50 కి పైగా భాషలు.. ఇక్కడా క్రైమ్ రేట్ ప్రపంచదేశాలన్నింటిలోకల్లా అత్యంత తక్కువ కావటానికి ఇక్కడ వాడబడుతున్న టెక్నాలజీలు ఒక కారణమైతే ఇక్కడి ఒక కనీవినీ ఎరుగని ఓ విచిత్రమైన రూల్ అత్యంత ముఖ్య కారణం, ఆ రూల్ – బతుకూ, బతకనీ..!!

చాలా విడ్డూరమైన రూల్ కదా? ఇదే అక్కడ ఉన్న ఇండియన్స్ లో చాలామందికి నచ్చనిది. ఇక్కడ ఉన్న ఇండియన్స్ మెచ్చేది. కీబోర్డ్ వెనకాల కూర్చుని ఎవరిని పడితే వారిని కామెంట్ చేయటానికి ఇక్కడ అవకాశం లేదు. ఆడవాళ్లు వేసుకునే బట్టల గురించి వాగే హక్కు లేదు. సెలెబ్రెటీల గురించి, వారి వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేసే హక్కు లేదు. రేప్ జరిగింది అంటే ఆడపిల్ల తప్పు కూడా ఉంది అని పబ్లిక్ గా కామెంట్ చేసి తప్పించుకునే అవకాశం ఇక్కడ దొరకదు. రోడ్ మీద, పబ్లిక్ ప్లేసుల్లో కనిపించారు కదా అని సెలెబ్రిటీలను సెల్ఫీ అడగటం, ఆటోగ్రాఫ్ అడగటం చేయకూడదు. అందుకే షారుఖ్ ఖాన్, వివేక్ ఒబేరాయ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు హాయిగా తిరుగుతూ ఉంటారు. హీరోయిన్లు కూడా మాల్స్ లో మనలానే తిరుగుతూ ఉంటారు.

dubai has so many rules that is why it is develpoed

రాత్రి 3 గంటలకు ఆడపిల్ల బయట ఉందేమిటి అని ఆమె వైపు చూసే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, కామెంట్ చేసే హక్కు లేదు. బురఖా వేసుకున్న వారితో అయినా, మినీ స్కర్ట్ వేసుకున్న వారితో అయినా మర్యాదగానే మాట్లాడాలి. చేసినది చేసి, నా వెనకెవరున్నారో తెలుసా అనే హక్కు లేదు. రాజకీయ నాయకులు లేరు, కాబట్టి కులాల మతాల గొడవలు లేవు, ఫ్రీ గా ఏదీ ఇవ్వరు. అధికార దుర్వినియోగానికి ఆస్కారం లేదు. ఏ మతానికి ఇక్కడ ప్రాముఖ్యత లేదు, మతం పూర్తిగా వ్యక్తిగతం. ఏ మతం (ఇస్లాం అయినా సరే) తాలూకూ ప్రమోషన్స్ చేయటానికి లేదు. పండగలు సెలెబ్రెట్ చేసుకునేటప్పుడు పక్కవారికి డిస్టర్బ్ చేయనంత వరకూ ఏమైనా చేసుకోవచ్చు. రోడ్ మీద చిందులు వేయకూడదు. ట్రాఫిక్ ఆగేలా చేయటానికి లేదు, రోడ్ బ్లాక్ చేసే హక్కు లేదు. నిరసనలకు ఆస్కారం లేదు.

సెలెబ్రిటీ పెళ్లి గురించి, చావు గురించి, విడాకుల గురించి మాట్లాడాల్సిన పని లేదు, పెళ్లి, చావు, విడాకులు ఆయా ఫ్యామిలీల వ్యక్తిగత అంశాలే. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకు, నువ్వు బతుకు మరొకరిని బతకనీ.!! ఒకరి పెళ్లి, ఒకరి చావు మీడియాలో టెలికాస్ట్ చేయకూడదు. వ్యక్తిగతం అంటే నిజంగానే వ్యక్తిగతం. ఇష్టం ఉన్నా లేకపోయినా అవతలి వ్యక్తి ఆడయినా మగయినా మర్యాద పూర్వకంగానే మాట్లాడాలి. చిత్రంగా ఇక్కడ పోలీసులు సాయం చేయటానికి ముందుకు వస్తారు, పైగా అవినీతికి పాల్పడరు. నీ రూంలో, నాలుగు గోడల మధ్య విచ్చలవిడిగా బతుకు, కానీ పబ్లిక్ ప్లేసుల్లో సీన్ క్రియేట్ చేయకు. ఎవరికి కష్టం కలిగేలానో, ఇబ్బంది కలిగేలానో నీ ప్రవర్తన ఉండకూడదు. హాయిగా బతుకు, ఇక్కడ ఎన్నో ఉన్నాయి అనుభవించు, ఒకరి ప్రయివసి కి భంగం కలిగించనీకు. చాలామంది అనుకుంటారు, ఇక్కడ మరణ శిక్షల అమలు ఎక్కువ అని. అది అపోహ మాత్రమే. ఇక్కడ భారీ జరిమానాలు ఉంటాయి, మరణ శిక్షలు, జైలు శిక్షలు చాలా అరుదు. ఆ జరిమానాల భయమే మనిషిని జాగ్రత్తగా మసులుకునేలా చేస్తుంది.

రోడ్ మీద నీరు ఆగి ఉంది, కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ నీరు పక్కన ప్లాట్ఫామ్ పై నడుస్తున్న వారిపై పడితే 20 వేల (4 లక్షల రూపాయలు) జరిమానా. అది తెలిశాక బుద్ధిగా డ్రైవ్ చేయరూ? రోడ్ మీద వెళుతున్న సెలెబ్రిటీని, ఆడపిల్లలను, మగవారిని అయినా ఫోటో తీస్తే భారీ జరిమానా.. అది తెలిశాక మనిషి జాగ్రత్తపడడూ? ఏ ఆడపిల్ల గురించయిన అసభ్యంగా మాట్లాడినట్టు రుజువైతే వారం రోజులు జైలు, ఆ తర్వాత వారి దేశానికి డిపోర్ట్. ఏదో నాలుగు పైసలు సంపాదించుకుందాం అని వచ్చిన వాడు అంత రిస్క్ తీసుకుంటాడా? ఇక్కడ అర్ధరాత్రులైన ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతారు, భయం అనే పదానికి అర్థం తెలియనట్టుగా ఉంటుంది. ఎవరికి మర్దర్ల, రాబరిలా భయం ఉండదు, చివరకు ఎడారుల వైపు వెళ్లినా కూడా ఆడపిల్లలు బార్బీక్యూ చేసుకుంటూ చిందులు తొక్కుతూ కనిపిస్తారు.

ఇదంతా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నేను ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన ఉన్నత స్థానంలో ఉండటమే గాక 15 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. పరిశీలనా శక్తి ఎక్కువ, పైగా రాత్రుళ్ళు పడుకునే అలవాటు బొత్తిగా లేకపోవటం ఇంకో కారణం. రోడ్లు బాగుంటాయి, స్పీడ్ 120 దాటకూడదు. నేనుంటుంది హై-వె కి దగ్గర కాబట్టి 118–120 కి తక్కువ కొట్టను. ఇంటర్నెట్ లేని ప్రదేశం, రాని ప్రదేశం లేదు. చుట్టుపక్కల ఉన్న షార్జా, రస్ అల్ ఖైమ, ఫుజైరా వంటి రాష్ట్రాలకు ఎప్పుడైనా వెళ్లి రావొచ్చు. ఎవరూ అడ్డుకోరు.

Tags: Dubai
Previous Post

స్త్రీ పురుషుడి నుండి ఏమి ఆశిస్తుంది?

Next Post

చింత చిగురు కనిపిస్తే అస్సలు వదలద్దు. ఆహారంలో తీసుకుంటే ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

Related Posts

వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.