lifestyle

ఈ 4 చిన్నపాటి నియమాలు పాటిస్తే 124 రోగాలనుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!

ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే 4 నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే చాలు, దాదాపు 124 రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవ‌చ్చు. ఈ 4 నియమాలు మనం తాగే నీటికి సంబంధించినవి కావడం విశేషం. అవేంటో ఇప్పుడు ఒక‌సారి చూద్దాం. తినడానికి 40 నిమిషాల ముందు తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లు తాగొద్దు.

బ్రేక్ ఫాస్ట్, లంచ్ , డిన్నర్.. ఏదైనా ఆహారం తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లను ముట్టొద్దు. ఎందుకంటే మనం తిన్న ఆహారం పోట్టలోని ఈసోపేగస్ ‌లోకి వెళతాయి. అక్కడ యాసిడ్‌ సూక్ష్మక్రిములను చంపేసి, కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు‌ చేస్తుంది. తక్కువ PH విలువ కలిగిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంజైమ్ లకు ఉపయోగపడి ఆహారం జీర్ణమయ్యి శక్తిని విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఆహారం తిన్నవెంటనే నీళ్లు తాగితే, జీర్ణ వ్యవస్థ నెమ్మదవుతుంది. నీరు అద‌నంగా వచ్చి చేరడం కారణంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లు డైల్యూట్ అయిపోతాయి. కాబట్టి జీర్ణం తర్వాత వ్యర్థాలు అలాగే మిగిలిపోతాయి. ఇవే అనేక రోగాలకు కారణం అవుతాయి. అందుకే తినడానికి 40 నిమిషాల ముందు తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లు తాగొద్దు.

follow these tips to prevent 124 types of diseases

నీళ్లను ఎప్పుడూ గటగటా తాగొద్దు. నీళ్లను ఒకేసారి గటగటా తాగకుండా టీ, కాఫీ తాగినట్టు సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల ప్రతి గుటక నీటితో, నోటిలోని లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోకి పోతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అలాకాకుండా నీటిని గటగటా తాగితే దాని మీద శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి వస్తుంది. ఈ సందర్భంలో అధిక ఎసిడిటీ కలుగుతుంది. ఇది రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే నీళ్లను ఎప్పుడూ గటగటా తాగొద్దు.

కూల్ వాటర్, ఐస్ వాటర్ తాగొద్దు. అతిగా కూల్ ఉన్న వాటర్ ను తాగొద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే శరీరంలో ప్రతి సమయంలో ఏదో ఒక క్రియ జరిగి బాడీ అంతా వేడిగా ఉంటుంది. ఈ సమయంలో కూల్ వాటర్ తాగితే రెండు పూర్తి వ్యతిరేక‌ టెంపరేచర్లు బాడీ మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. తప్పదు అనుకుంటే కుండలో నీళ్లు చాలా బెటర్. అంతేకానీ ఐస్ వాటర్ వద్దు. నిద్రలేవగానే 2-3 గ్లాసుల వాటర్ తాగాలి. ఇప్పుడిప్పుడే ఈ సూత్రాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు.

నిద్రలేవడంతోనే ఓ మూడు గ్లాసుల నీటిని తాగాలి. ఆ నీరు శరీరంలోని పేరుకుపోయిన వ్యర్థాన్నంతా మలవిసర్జన రూపంలో బయటికి పంపుతుంది. 3 నిమిషాల్లో నంబర్ 2 పనిపూర్తయ్యేలా చేస్తుంది. ఒక్కసారికే శరీర వ్యర్థాలను విసర్జించిన వారికి రోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇదిగో నీటితో ముడిపడి ఉన్న ఈ నాలుగు సూత్రాలను క్రమం తప్పకుండా పాటించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Admin

Recent Posts