lifestyle

మీరు ప్రేమలో ఉన్నారని తెలుసుకోడం ఎలా.?

ఒక మనిషి ప్రేమలో ఉన్నాడని తెలుసుకోడానికి ఏం చేస్తారు.? మీరు ప్రేమలో ఉంటే మీరు ప్రేమించిన వారిని కలుసుకున్నప్పుడు మీ మొఖంలో ఏదో తెలియని వెలుగు వస్తుంది, మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఏదో తెలియని సంతోషం. ఒంట్లోని ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా, ఇదేమి పుకారు కాదు, ఇది ఒక అధ్యయ‌నంలో తేలిన నిజం. తైవాన్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌కు చెందిన 700 మంది వ్యక్తులపైన ఫిన్లాండ్‌లోని ఆల్టో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు, ఈ అధ్యయ‌నంలో తేలిన విషయాలు ఏంటంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు ఆ మనిషి మొఖంలో ఏదో తెలియని వెలుగు, ముఖంలోని కండరాలన్నీ వెలిగిపోతాయట.

అలాంటి వారిలో మానసిక ఉద్వేగాలు శరీరాన్ని ఎలాంటి అనుభూతులకు గురిచేస్తాయన్న అంశంపై పరిశోధన చేశారు. కంప్యూటర్‌లో మానవ దేహాల చిత్రాలను చూపించి వారిలో ఉద్వేగాలను కలిగించారు. వీరు చిత్రాలను చూసినప్పుడు ప్రాథమిక ఉద్వేగాలన్నీ ఎక్కువగా గుండె కొట్టుకునే వేగం, శ్వాసపీల్చుకోవడంపైనే ఎక్కువగా ప్రభావం చూపినట్టు అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయ‌నంలో తేలిన ఇంకో విషయం ఏంటంటే, ప్రేమించినప్పుడు సంతోషం కలుగుతుందట. మీరు ఒకరిని ప్రేమిస్తున్నారని మీకు అనిపిస్తే, మీరు వారిని విడిచి పెట్టి ఉండలేరు, వారితో మాట్లాడనిదే మీకు రోజు గడవదు, వారు మీకు ద‌గ్గరగా ఉన్నంత సేపు సంతోషంగా, దూరంగా ఉన్నప్పుడు బాధగా ఉంటారు.

how to tell if you are in love

వారే మీ జీవితం అని మీకు అనిపిస్తుంది, ఎవ్వరి మాట వినని వాళ్ళు కూడా ప్రేమించిన వారి మాట వింటారు, వారి పైన మీకు ఉండే ఆప్యాయత, అనురాగం వల్ల మీరు వారిని ప్రేమిస్తున్నారని మీకు అర్ధం అవుతుంది. ప్రేమించటం తప్పు కాదు, కానీ ప్రేమకు ఆకర్షణకు అర్ధం తెలుసుకోకపోడం తప్పు. అన్నింటికన్నా ముఖ్యంగా డబ్బు, అందం చూసి ప్రేమిస్తే తరువాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ప్రేమను వ్యక్తపరచడం కూడా ముఖ్యమే.

Admin

Recent Posts