మగ స్నేహితులతో మాట్లాడితే చాలు బాయ్ ఫ్రెండ్ భగ్గుమంటున్నాడా? మిమ్మల్ని నిందిస్తున్నాడా? ఇలా ఎందుకని, అతనుమిమ్మల్ని ఎందుకు అర్ధం చేసుకోడు? ఒక పురుషుడు అసూయ చెందటానికి అనేక కారణాలుంటాయి. పరిశీలించండి. అతనికి వుండే అసూయ స్వతహాగా వున్నది కావచ్చు. లేక పరిస్ధితుల కారణంగా ఇటీవలే ఏర్పడివుండవచ్చు. కనుక సరైన కారణం తెలుసుకోండి. లేదా మీ తీరు అతనికి అసూయ కలిగించవచ్చు. మగాళ్ళతో మిమ్మల్ని తిరగొద్దని అతను అంటే, మానేయండి. లేదా స్నేహాలను, ప్రేమను రెంటిని బ్యాలన్స్ చేయండి.
అతని నమ్మకాన్ని పొందటానికి వివరించండి. అతని సందేహాలు నివారించండి. అతను మీ చర్యలను నమ్మకపోతేనే అసూయపడతాడు. మంచి సంబంధాలకుగాను అతని సందేహాలు నివారించండి. అతను మీకు చాలా విలువకల వ్యక్తి అని తెలుపండి. అతని స్ధానం మీ జీవితంలో ఎంతో గొప్పదని చెప్పండి. ఈ రకంగా అతనికి వివరించడం ద్వారా మీరు అతని అసూయను తగ్గించగలరు.
మంచి ప్రేమ జీవితానికి మంచి సంబంధం పునాది. అందులో ఏ రకమైన సందేహాలు వుండరాదు. ఇంత చెప్పినా మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మక అసూయపడి విసిగిస్తుంటే, మీరు ఉన్న పరిస్ధితిని అర్ధం చేసుకొనక అంగీకరించలేకపోతే, ఇక మీరు నిర్ణయించుకోవాలి. అసూయ అనేది సంబంధం ఎంత బలమైనా సరే పాడు చేస్తుంది. పరిష్కారం కుదరకపోతే తర్వాత పశ్చాత్తాప పడేకంటే అతనిని వదిలేయండి.