ఒక్కసారి మీ పార్టనర్ తో ఒప్పేసుకుంటున్నారంటే….అతని విద్యార్హతలేమిటి? కుటుంబ చరిత్ర ఏమిటి? మొదలైనవాటికి సమాధానాలు ఇవ్వగలగాలి. అందుకుగాను బాగా ఆలోచించాలి. కుటుంబం, విద్య రెండూ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చి దిద్దుతాయి. అందుకుగాను కొన్ని అంశాలు మీరు పరిశీలించాలి. వ్యక్తిత్వం గురించి ఖచ్చితంగా ఏదీ చెప్పలేము. అతను అదివరలో ఎలా వున్నా, ప్రస్తుతం ఎలా కనపడుతున్నాడనేది పరిశీలించండి. అతని స్నేహితులు, అతని చుట్టూ వుండే వారు, ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా కూడా చూడాలి.
అతను కనుక నీతి నిజాయతీ, గౌరవ, మర్యాద, నిజాలు పలికే వాడైతే మీరు అదృష్టవంతులే. మంచిగా వుంటే చాలదు. మిమ్మల్ని మీ పిల్లల్ని బాగా చూసేవాడైవుండాలి. విద్య ద్వారానే అతనికి మర్యాద లభిస్తుంది. వ్యక్తిత్వానికి బంగారపు అంచు విద్య. కుటుంబ విలువలు తెలిస్తే అతను పెద్దలను ఎలా గౌరవిస్తాడనేది తెలుస్తుంది. బంధుత్వాలు, అనురాగాలు, అనుభవాల విలువలు అతను గౌరవించగలడు.
చాలామందికి ధనం ప్రధానం కాకపోవచ్చు. కాని స్వేచ్ఛగా, సంతోషంగా జీవించాలంటే డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది. చూపులకు, ఫ్యాషన్లకు ఎలా? ప్రేమించాలంటే, ముఖ కవళికలు, వ్యక్తిత్వం, ఫేషన్ వంటివి వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. ఈ అంశాలు పరిశీలిస్తే మీ నిర్ణయం అవధులులేని ఆనందాలకు దోవతీస్తుందనటంలో సందేహం లేదు.