lifestyle

Chanakya Niti : ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి.. లేదంటే మీకే చాలా నష్టం..!

Chanakya Niti : ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. అందరి స్వభావం, తీరు ఒకేలా ఉండదు. అయితే, కొంతమంది వ్యక్తులతో ఉండడం కంటే, వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిదని చాణక్య అన్నారు. చాణక్య, మనకి సంబంధించిన చాలా విషయాలను ఎంతో చక్కగా వివరించడం జరిగింది. చాణక్య చెప్పినట్లు చేస్తే, జీవితంలో అస్సలు బాధలే ఉండవు. ఆచార్య చాణక్య కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉండాలని చెప్పారు. ఇటువంటి వ్యక్తులతో దూరంగా లేకపోతే ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆచార్య చాణక్య చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం.

అత్యాశ, స్వార్థపరుడు నుండి దూరంగా ఉండాలని చాణక్య అన్నారు. ఇటువంటి వాళ్ళు వారి సొంత ప్రయోజనాలకి మాత్రమే వాడుకుంటారు. తర్వాత ఇతరులని బాధపడతారు. కాబట్టి, అత్యాశ, స్వార్థపరులకు దూరంగా ఉండాలి. అలానే, చాణక్య చెప్పినదని ప్రకారం నీతి నిజాయితీ లేని వ్యక్తులకి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి దూరంగా లేకపోతే మనమే బాధపడాలి. నీతి నిజాయితీ లేని వాళ్ళతో స్నేహం చేయడం వలన, ఎంతటి ద్రోహం చేయడానికి అయినా వాళ్ళు ఆలోచించరు. ఎప్పుడైనా వాళ్ళు దాడి చేయొచ్చు.

keep away from this type of people

అలానే, సోమరి, ఆశయం లేని వాళ్ళకి కూడా దూరంగానే ఉండాలి. జీవితంలో ఎలాంటి ఆశయం లేని వారు, సోమరితనం ఉన్నవాళ్లు పైకి రాలేరు. వాళ్లతో స్నేహం చేస్తే ఎప్పుడూ నష్టమే కలుగుతుంది అని చాణక్య చెప్పారు. కోపం ఉన్న వాళ్లకి కూడా దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి దగ్గరగా ఉంటే కూడా ప్రమాదమే అని చాణక్య అన్నారు.

అలానే, హింస చేసే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. ఇలా ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్లకి దూరంగా ఉండాలి. లేదంటే, అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. సమస్యలు వస్తాయి. చూశారు కదా చాణక్య చెప్పిన ముఖ్యమైన విషయాలని, కచ్చితంగా వీటిని ఆచరించండి లేదంటే మీరే ఇబ్బందుల్లో పడతారు. అనవసరంగా ఇతరులు కారణంగా మీరు మోసపోతారు.

Admin

Recent Posts