lifestyle

మీ పార్ట్ నర్ తో హ్యపీగా లేరు అనడానికి సంకేతాలు ఇవే…!

భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే వారి జీవితం ముందుకు సాగుతుంది. కానీ కొంతమంది పెళ్లి అయినప్పటి నుంచి ప్రతి దానికి గొడవ పడుతూనే ఉంటారు. చిన్న చిన్న వాటికి భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు అరుస్తూ ఉంటారు. అయితే మనం దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నామో లేదో కూడా చాలామందికి తెలియదట. మీరు సంతోషంగా ఉన్నారో లేదో ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చు.

దాంపత్య జీవితం సరిగ్గా లేని వారు శృంగారానికి దూరం అవుతారు. వారికి అసలు రాత్రి కలయికలో పాల్గొనాలని కోరిక కూడా కలగదు. ఒకవేళ మీకు కలయికలో పాల్గొనాలని కోరిక కలిగిన, మీ పార్ట్నర్ తిరస్కరించడం లాంటివి చేస్తున్నారు అంటే కూడా, మీరు సంతోషంగా లేరనే అర్థం. మీరు విడిపోకపోయినా, విడిపోవాలి అనే భావనలు తరచూ కలుగుతున్నాయి అంటే, మీ దాంపత్య జీవితం సరిగ్గా లేదనే అర్థం. అంతేకాదు, మీ పార్ట్నర్ తో కాకుండా, మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న, పెట్టుకోవాలని ఆలోచన వచ్చిన, మీరు మీ పార్ట్నర్ తో సంతోషంగా లేరని అర్థం.

these signs indicate that you are not happy with your life partner

ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ, ఒకరితో మరొకరు కనీసం మాట్లాడుకోకుండా, ఎవరి పని వారు అన్నట్లుగా ఉంటున్న, మీ బంధం సరిగ్గా లేదని అర్థం. ఎవరికి వారు సంబంధం లేనట్లుగా బతుకుతున్నారు అంటే, మీ బంధం విడిపోవడానికి దగ్గరగా ఉందని అర్థం. దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు, సరదాలు ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా, జీవితంలో కనీసం ఎలాంటి ఫన్ లేకుండా, బోరింగ్ గా ఉన్నా కూడా, మీ బంధంలో మీరు సంతోషంగా లేరని అర్థం. దాంపత్య జీవితంలో దంపతులు ఒకరికొకరు పారదర్శకంగా ఉండాలి. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. తమ బంధం పట్ల కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలాంటి అవాంతరాలు వచ్చినా విడిపోరు అనే నమ్మకం ఉండాలి. ఇవేమీ లేకపోయినా, మీ బంధం సరిగ్గా లేదనే అర్థం.

Admin

Recent Posts