lifestyle

పిల్లల ముందు, భార్యాభర్తలు అస్సలు చేయకూడని 5 పనులు..!

పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తుంది. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయడానికి ప్రయత్నించడానికి ముందు, పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. మరి ఇప్పుడు, పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు చేయకూడని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

పబ్లిక్ లో మీ పిల్లలను విమర్శించడం, మీ పిల్లలను అవమానించడం చేయకూడదు. అతను లేదా ఆమెకు మీ మీద వ్యతిరేకంగా ప్రతికూల భావాలు కలుగవచ్చు. తప్పుడు భాష ఉపయోగించడం. అతను లేదా ఆమె ప్రతి చోట తప్పు భాషను ఉపయోగించడం ప్రారంభిస్తే అది వారిని పాడు చేయవచ్చు. క్రమశిక్షణ రాహిత్యం.. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణ రాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి, తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణగా తీసుకొని మెదులుతూ ఉంటారు.

couple should not do these works in front their children

చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి పిల్లలను అబద్ధం చెప్పమని అడుగుతారు. పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారు అంటే భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెప్పడమే ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Admin

Recent Posts