వైద్య విజ్ఞానం

Blood Circulating : శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే ప్ర‌మాదం.. ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో చూసుకోండి..!

Blood Circulating : మన శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌సర‌ణ వ్య‌వ‌స్థ ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. ర‌క్తం ద్వారా అవ‌యవాలు ఆక్సిజ‌న్‌ను, పోష‌కాల‌ను గ్ర‌హిస్తాయి. దీంతో శ‌రీర విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌న శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌రణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

blood circulating system down symptoms

1. మెద‌డుకు ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంది. మ‌తిమ‌రుపు వ‌స్తుంది. చీటికీ మాటికీ త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. బద్ద‌కంగా ఉంటారు. యాక్టివ్‌గా ఉండ‌లేరు. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మెద‌డుకు స‌రిగ్గా ర‌క్తం అంద‌డం లేద‌ని గ్ర‌హించాలి.

2. కిడ్నీల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే కిడ్నీల ప‌నితీరు మంద‌గిస్తుంది. కిడ్నీ వ్యాధులు వ‌స్తాయి. కిడ్నీలు వాపున‌కు లోన‌వుతాయి. మూత్రం రంగు మారుతుంది. మూత్రం దుర్వాస‌న వ‌స్తుంది.

3. కాళ్ల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌కపోతే కాళ్ల‌లో ఉండే నరాలు ప‌ట్టేసిన‌ట్టు అనిపిస్తాయి. ఒక్కోసారి కాళ్ల‌ల్లో స్ప‌ర్శ కూడా ఉండదు. నొప్పులు కూడా వ‌స్తుంటాయి. కాళ్లు వాపుల‌కు గుర‌వుతాయి. నీరు చేరుతుంది.

4. కాలేయానికి ర‌క్తం స‌రిగ్గా ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌క‌పోతే ఆక‌లి వేయ‌దు. బ‌రువు కూడా త‌గ్గుతారు. చ‌ర్మం రంగు మారుతుంది. లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోతుంది.

5. జ‌న‌నావ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే శృంగార సామ‌ర్థ్యం త‌గ్గుతుంది. స్త్రీల‌లో రుతు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హార్మోన్లు అస‌మ‌తుల్యం అవుతాయి.

క‌నుక ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా క‌నిపిస్తుంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగ్గా ప‌నిచేసేలా చేయ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts