Eye Disease Symptoms : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. కళ్లతోనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాము. శరరంలో ఇతర అవయవాల గురించి ఎంత శ్రద్ద తీసుకుంటామో కళ్ల గురించి కూడా అంతే శ్రద్ద తీసుకోవాలి. కానీ మనలో చాలా మంది వివిధ రకాల కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇతర అవయవాల వలె కళ్లు కూడా ముందుగానే మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తాయి. ఈ సంకేతాలు మాక్యులర్ డీజెనరేషన్, రెటీనా డిటాచ్ మెంట్, రిఫ్రాక్టివ్ ఎర్రర్, డ్రై ఐ సిండ్రోమ్, కుంటి శుక్లాలు, గ్లాకోమా, మయోపియా వంటి కంటి సమస్యలను తెలియజేస్తాయి. కానీ వాటిని గుర్తించలేక చాలా మంది తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఈ సమస్యలు చూపుపోవడానికి కూడా దారి తీయవచ్చు. ఇటువంటి కంటి సంబంధిత సమస్యల బారిన పడే ముందు కళ్లు తెలియజేసే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కనుపాప, కంటి యొక్క రంగు మారుతుంది. కనుపాప రంగులోమార్పు వచ్చినట్టు గుర్తించిన వెంటనే కంటి వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. కనుపాప రంగు మారడం కూడా కొన్ని కంటి వ్యాధులను సూచిస్తుంది. అలాగే క్రాస్డ్ కళ్లు లేదా స్ట్రాబిస్మస్, ఇది ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. పెద్దలల్లో కూడా ఈసమస్య తలెత్తవచ్చు. ఈ సమస్యలో కళ్లు చూసే దిశ మారుతుంది. ఇది కూడా కొన్ని రకాల కంటి సమస్యలను సూచిస్తుంది. ఈ లక్షణాన్ని గనుక గమనించినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. అలాగే మనం చూసేటప్పుడు మన చూపు మధ్యలో నల్లటి చుక్కలాగా కనిపించనకూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మాక్యులర్ డిజెనరేషన్, రెటీనా డిటాచ్ మెంట్ ను సూచించవచ్చు. అదే విధంగా దగ్గరగా మరియు దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోవడం. ఇది సాధారణ సమస్యే అయిన నిర్లక్ష్యం చేయవద్దు. తరుచూ కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ సమస్యను ముందుగానే గుర్తించవచ్చు.
అలాగే మనం చూసే వస్తువు ఒక్క దానికి బదులుగా రెండు ఉన్నట్టుగా కనిపించిన కూడా నిర్లక్ష్యం చేయవద్దు. దీనిని డబుల్ విజన్ లేదా డిప్లోపియా అంటారు. ఇది కంటి కండరాల బలహీనత, కంటి శుక్లం వంటి సమస్యలను తెలియజేస్తుంది. అదే విధంగా కళ్లలో దురద, పొడి బారినట్టుగా ఉండడం, మంటలు వంటి లక్షణాలు డ్రై ఐ సిండ్రోమ్ ను తెలియజేస్తాయి. తగిన చికిత్స తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే అస్పష్టమైన కంటిచూపు లేదా మసకగా కనిపించడం వంటివి కంటిశుక్లం, కార్నియల్ వంటి సమస్యలను సూచిస్తాయి. ఈ లక్షణం కనిపించిన వెంటనే కంటి వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. అలాగే కంటి నుండి నీరు ఎక్కువగా కారడం, కంటి నుండి పుసి ఎక్కువగా రావడం వంటివి కొన్ని రకాల అలెర్జీలను, ఇన్పెక్షన్ లను సూచిస్తాయి. ఈ విధంగా వీటిలో ఏ లక్షణాలు కనిపించిన నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.