వైద్య విజ్ఞానం

అస‌లు రోజులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చు..?

కొత్తగా పెళ్లి అయినవాళ్లు రోజులో మూడు-నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి సిగ్గుపడకూడదు, భయ పడకూడదు. కోరికలు అనేవి మగ, ఆడ ఇద్దరిలో సమానమే. శృంగారం.. రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు, ఇది ఇరువురికి మానసికంగా,శారీరకంగా ఎంతో మేలు చేస్తుంది. అయితే రోజులో ఎన్నిసార్లు శృంగారం చేయొచ్చు అనేది చాలా మందికి వచ్చే సందేహం. కొత్తగా పెళ్లి అయినవాళ్లు రోజులో మూడు-నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. ఈ నేపథ్యంలో రోజులో ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది కాదేమోనని కొందరిలో నెలకొన్న అనుమానాలకు నిపుణులు ఏం సమధానమిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

శృంగారంలో పాల్గొనడానికి పరిమితి అంటూ ఏం ఉండదని కొందరు నిపుణులు చెబుతున్నారు. కోరిక, సామర్థ్యం ఉంటే ఎన్నిసార్లైనా పాల్గొనవచ్చని చెబుతున్నారు. ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల ఎవరూ నీరసపడరని,శృంగారం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, ఆరోజు చాలా ఫ్రెష్​గా అనిపిస్తుందని, ఆరోగ్యం బాగుపడుతుందని తెలిపారు. శృంగారం వల్ల ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ప్రతిరోజూ ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే శృంగారంలో పాల్గొనే ఇద్దరు వ్యక్తులకు ఒకే సమయంలో లేదా భాగస్వామి మాదిరిగానే రొమాన్స్ లో పాల్గొనాలని అనుకోరు.

how many times couple can participate in sex per day

ఒక భాగస్వామికి ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన వేరే భాగస్వామికి ఉండాలన్న నియమం లేదు. వారికి ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొంటే మీరు వారిని బలవంతం పెట్టినట్టే అవుతుంది. ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరూ ఇంట్రెస్ట్ గా ఉంటే మాత్రం రోజులో ఎన్నిసార్లు అయినా శృంగారంలో పాల్గొనవచ్చంట. ఎందుకంటే శృంగారం​ వల్ల ఫీల్​ గుడ్ హార్మోన్స్​ విడుదలవుతాయని అంటున్నారు నిపుణులు.

Admin

Recent Posts