సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి..? చాలా మంది ఈ రోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటుగా సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వాలి. సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సైలెంట్ హార్ట్ ఎటాక్ బతకడానికి ఇంకో అవకాశం ఇవ్వదు. ఛాతిలో నొప్పి కలుగుతుంది. అయితే ఇది వచ్చే ముందు కొన్ని లక్షణాలు అయితే కనబడతాయి. దీంతో సైలెంట్ హార్ట్ ఎటాక్ ని మనం గుర్తించొచ్చు.
అయితే, వృద్ధులు కానీ షుగర్ సమస్యతో బాధపడే వాళ్లకు కానీ ఎలాంటి నొప్పి లేకుండా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనపడతాయి. అవేంటంటే నీరసంగా ఉండడం, గుండెలో మంట, ఫ్లూ, అజీర్తి, ఛాతిలో నొప్పి లేదంటే నడుము భాగంలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఉబకాయం ఉన్నవాళ్ళకి ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. శారీరక వ్యాయామం లేకపోవడం, షుగర్, బీపీ, ఉన్నవాళ్లలో కూడా ఇది వస్తుంది. అలాగే ఒత్తిడి, స్మోకింగ్, కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చినా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటుగా బరువుని అదుపులో ఉంచుకోవడం, ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండడం వలన ఈ సమస్య వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.