Bellam Jalebi : చ‌క్కెర‌తోనే కాదు.. బెల్లంతోనూ రుచిక‌ర‌మైన జిలేబీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..

Bellam Jalebi : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంట‌కాల్లో జిలేబీ ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు స్వీట్ షాపుల్లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ఈ జిలేబీలు విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ ఎక్కువ‌గా ఈ జిలేబీల‌ను పంచ‌దార‌తో త‌యారు చేస్తూ ఉంటారు. కేవ‌లం పంచ‌దార‌తోనే కాకుండా ఈ జిలేబీల‌ను మ‌నం బెల్లంతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లంతో చేసే జిలేబీలు క‌ర‌క‌ర‌లాడుతూ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ బెల్లం జిలేబీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం జిలేబి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – 100 గ్రా., బెల్లం తురుము – 200 గ్రా., వంట‌సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Bellam Jalebi recipe in telugu very sweet and tasty
Bellam Jalebi

బెల్లం జిలేబి త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి పిండిని 12 గంటల పాటు నాన‌బెట్టుకోవాలి. 12 గంట‌ల త‌రువాత క‌ళాయిలో బెల్లం, అర గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగి లేత తీగ పాకం వ‌చ్చే వ‌ర‌కు దీనిని ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యే లోపు మందంగా ఉండే కాట‌న్ వ‌స్త్రం లేదా ప్టాస్టిక్ క‌వ‌ర్ ను తీసుకుని దానిని కోన్ ఆకారంలో చుట్టుకుని అందులో పిండిని పోసి పైన ర‌బ్బ‌ర్ బ్యాండ్ వేసి ముడి వేయాలి. ఇప్పుడు క‌వ‌ర్ చివ‌ర లేదా వ‌స్త్రం చివ‌ర చిన్న రంధ్రం చేసి నూనెలో జిలేబీల‌ను వేసుకోవాలి. ఈ జిలేబీల‌ను రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని పాకంలో వేసి 30 సెక‌న్ల పాటు అలాగే ఉంచాలి.

త‌రువాత ఈ జిలేబీల‌ను ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే బెల్లం జిలేబీలు త‌యార‌వుతాయి. పండుగ‌ల‌కు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో లేదా తీపి వంట‌కాలు ఏదైనా తినాలనిపించిన‌ప్పుడు ఇలా బెల్లం జిలేబీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ జిలేబీల‌ను సాస్ బాటిల్ లేదా ప్లాస్టిక్ బాటిల్ మూతకు చిన్న రంధ్రం చేసి వాటి స‌హాయంతో కూడా వేసుకోవ‌చ్చు. పంచ‌దారతో చేసిన జిలేబీల కంటే బెల్లంతో చేసిన ఈ జిలేబీల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

D

Recent Posts