lifestyle

Belly Button : బొడ్డు గురించి మీకు తెలియని ఆసక్తికరమైన‌ విషయాలు ఇవే..!

Belly Button : బొడ్డు గురించిన ఆసక్తికర విషయాలనగానే ఇవి సినిమాల్లోని హీరోయిన్ల బొడ్డు గురించినవని అనుకునేరు. అవి మాత్రం కావు. కానీ మానవ శరీరంలో బొడ్డు ఒక ప్రధానమైన భాగం. కడుపులోని బిడ్డకు, తల్లిని అనుసంధానం చేసే బొడ్డుపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కూడా చేశారు. మృదువుగా ఉన్నా, అంద విహీనంగా ఉన్నా, పోగులతో పియర్సింగ్ చేయించుకున్నా, టాటూ వేయించుకున్నా బొడ్డు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాని గురించిన ఆసక్తికరమైన‌ విషయాలను తెలుసుకుందాం.

మనిషి శరీరంలో భాగంగా ఉండే బొడ్డులో దాదాపు 67 రకాల బాక్టీరియా ఉంటుంద‌ట‌. శరీరంలో అపరిశుభ్రంగా ప్రదేశాల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే జనాభాలో కేవలం 4 శాతం మందికి మాత్రమే బొడ్డు బయటికి ఉంటుంది. మిగతా వారికి బొడ్డు లోపలికి ఉంటుంది. బయటికి ఉండే బొడ్డును ఫాల్టీ బెల్లీ అని కూడా పిలుస్తారు. శిశువు జన్మించినప్పుడు తల్లితో అనుసంధానమైన పేగును సరిగ్గా ముడి వేయకపోవడం వల్లే బొడ్డు అలా కొందరిలో బయటికి వస్తుంది. మహిళల్లో కంటే పురుషుల్లోనే బొడ్డు లింట్ ఎక్కువగా ఉంటుంది. లింట్ అంటే డెడ్ స్కిన్ సెల్స్, వెంట్రుకలు తదితరాలో ఏర్పడే ఫైబర్ లాంటి మెత్తని పదార్థం. పురుషులకు బొడ్డు చుట్టూ వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారిలోనే ఈ లింట్ ఎక్కువగా ఉంటుంది.

belly button important facts to know

స్త్రీలలో బొడ్డును శృంగారానికి ప్రధాన ఆకర్షణగా భావిస్తారు. కానీ ప్రపంచం మొత్తం మీద అత్యంత గ్లామ‌ర్‌ మహిళగా పేరుగాంచిన ఓ మహిళకు మాత్రం అసలు బొడ్డే లేదు. క్షీరద జాతికి చెందిన జీవుల్లో మాత్రమే బొడ్డు ఉంటుంది. గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచే జీవరాశుల్లో బొడ్డు ఉండదు. బొడ్డుకు పియర్సింగ్ (పోగు) చేయించుకోవడం నేడు ఎక్కువైంది. అయితే ఇలా పియర్సింగ్ చేయించుకున్న తరువాత అయ్యే గాయం మానేందుకు దాదాపు 9 నెలలు పడుతుంది. అయితే ముక్కు, కనుబొమ్మలు, చెవులపై చేసే పియర్సింగ్ గాయం మానేందుకు కేవలం 6 వారాల సమయం మాత్రమే పడుతుంది.

ఆంగ్ల అక్షరం T ని పోలి ఉండే బొడ్డును అత్యంత సుందరమైందిగా చెబుతారు. ఇవి అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తాయట. ఏ ఇద్దరు వ్యక్తులకు కూడా ఒకే రకమైన బొడ్డు ఉండదు. చేతి వేలి ముద్రల్లాగే ఇవి కూడా వేర్వేరుగా ఉంటాయి. బొడ్డును శరీరం మధ్యలో కలిగిన ఉన్న స్త్రీలు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారట.

Admin

Recent Posts