Chanakya Niti : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విలువైన విషయాలను చాణక్య నీతి అనే పుస్తకం ద్వారా తెలియజేసాడు. చాణక్యుడు చెప్పిన విషయాలను పాటించిన వారు జీవితంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ఎన్ని సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొని నిలబడతారు. చాణక్యుడు మనకు చెప్పిన మంచి విషయాల్లో ఒక దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దుఃఖాన్ని కానీ, బాధను కానీ కొందరు వ్యక్తుల దగ్గర అస్సలు చెప్పకూడదని చాణక్య నీతి చెబుతుంది. మన బాధను ఇతరుల దగ్గర చెప్పుకుంటే వారు మనల్ని ఎగతాళి చేయవచ్చు. దీంతో మన బాధ మరింత ఎక్కువ అవుతుంది. చాణక్య నీతి ప్రకారం మన బాధను చెప్పకూడని ఐదుగురు వ్యక్తులేవరో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్య నీతి ప్రకారం ప్రతి దానిని ఎగతాళి చేసే వారి దగ్గర మన బాధను పంచుకోకూడదు.
వీరు మన బాధను చాలా తేలికగా తీసుకుంటారు. మన దుఃఖాన్ని వారు ఎగతాళి చేయవచ్చు. అలాగే అందరికి మిత్రుడు అయిన వాడు ఎవరికి మిత్రుడు కాడు అనే సామెత ఉండనే ఉంది. కనుక అందరితో స్నేహం చేసే వారితో కూడా మన బాధను చెప్ప కూడదు. ఇతను మన బాధను ఇతరులతో చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనకు స్నేహితుడు అయినప్పటికి అందరితో స్నేహం చేసే వారితో మనకు బాధను పంచుకోకూడదు. అలాగే మన పురోగతి, విజయం పట్ల అసూయ చెందే వారికి కూడా మన దుఃఖాన్ని, బాధను చెప్పకూడదు. ఇలాంటి వారు మన బాధను చెప్పినప్పుడు పైకి ఓదార్పుగా, మంచిగా మాట్లాడినప్పటికి లోపల సంతోషంగా ఉంటారు. అలాగే కొంత మంది ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు.
ఎవరితోనైనా వారు చెప్పేది వినకుండా, అర్థం చేసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వారికి కూడా మన బాధను చెప్పకూడదు. ఇలాంటి వ్యక్తులు మన బాధను ప్రతికూలంగా వక్రీకరించగలరు. కనుక ఇలాంటి వారికి కూడా బాధను చెప్పకూడదు. అలాగే కొందరు ఇతరుల గురించి అస్సలు ఆలోచించరు.మంచి జరిగినా, చెడు జరిగినా వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎవరికి హాని కలిగిన వీరు పట్టించుకోరు. ఎప్పుడూ వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటారు. అలాంటి వ్యక్తులకు మన దుఃఖాన్ని చెప్పకూడదు. వీరు మనం చెప్పే బాధలను ఎప్పటికి అర్థం చేసుకోలేరు. చాణక్య నీతి ప్రకారం ఇటువంటి వ్యక్తులకు మన బాధను ఎప్పటికి చెప్పకూడదని వీరికి మన బాధలను చెప్పుకున్నప్పటికి అది వ్యర్థమే అవుతుంది.