Dabbakaya Chutney : ద‌బ్బ‌కాయ చ‌ట్నీ త‌యారీ ఇలా.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Dabbakaya Chutney : ప‌చ్చ‌ళ్ల విష‌యానికి వ‌స్తే చాలా మంది వాటిని ఇష్టంగానే తింటారు. సీజ‌న్ల‌ను బ‌ట్టి కూడా ప‌చ్చ‌ళ్ల‌ను లాగించేస్తుంటారు. వేస‌విలో మామిడికాయలు వ‌స్తాయి క‌నుక ఈ సీజ‌న్‌లో మామిడికాయ ప‌చ్చ‌డి వెరైటీల‌ను ఆస్వాదిస్తుంటారు. అయితే మ‌న‌కు కొన్ని భిన్న‌ర‌కాల ప‌చ్చ‌ళ్లు కూడా ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉంటాయి. వాటిల్లో ద‌బ్బ‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. దీన్ని ఇలా త‌యారు చేసి తిన్నారంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ప‌చ్చ‌డి పెట్ట‌గానే పాత్ర మొత్తం ఖాళీ చేస్తారు. అంత‌లా దీని టేస్ట్ ఉంటుంది. ఇక ద‌బ్బ‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌బ్బ‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ద‌బ్బ‌కాయ – 1, బెల్లం – 500 గ్రాములు, ఎండు మిర్చి – 20, ఉప్పు – త‌గినంత‌, మెంతులు – 1 టీస్పూన్‌, ఆవాలు – 1 టీస్పూన్‌.

Dabbakaya Chutney recipe make in this method for taste
Dabbakaya Chutney

తాళింపు కోసం..

నూనె – 1 టేబుల్ స్పూన్‌, శ‌న‌గ‌ప‌ప్పు – 1 టేబుల్ స్పూన్‌, మిన‌ప ప‌ప్పు – 1 టీస్పూన్‌, ఆవాలు – 1 టీస్పూన్‌, ఎండు మిర్చి – 2, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు.

ద‌బ్బ‌కాయ ప‌చ్చ‌డిని త‌యారు చేసే విధానం..

ముందుగా ద‌బ్బ‌కాయ‌ను ముక్క‌లుగా కోసి కుక్క‌ర్‌లో వేయాలి. అందులోనే ఎండు మిర్చి, ఉప్పు, కొన్ని నీల్లు పోసి ఉడికించాలి. మ‌రో బాణ‌లిలో ఆవాలు, మెంతులు విడివిడిగా దోర‌గా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీట‌న్నింటినీ మిక్సీ జార్‌లో తీసుకుని కాస్త బెల్లం కూడా చేర్చి రుబ్బుకోవాలి. ఇది కాస్త ప‌లుచ‌గా ఉంటేనే బాగుంటుంది. దీనికి శ‌న‌గ‌ప‌ప్పు, ఆవాలు, ఎండు మిర్చి, క‌రివేపాకు, మిన‌ప ప‌ప్పు వంటివి వేసి తాళింపు పెట్టాలి. దీన్ని పునుగులు, ఇడ్లీలు, దోశ‌ల్లో తింటే భ‌లే రుచిగా ఉంటుంది. ద‌బ్బ‌కాయ‌లోని సి విట‌మిన్ మ‌న‌లో వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఇది పెరుగన్నంలోకి బాగుంటుంది.

Editor

Recent Posts