Sleeplessness Side Effects : మనిషికి తిండి, నీరు, వ్యాయామం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది నిద్ర సరిగ్గా పోవడం లేదు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు.. ఇలా కారణాలు ఏమున్నా సరే చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే నిద్ర సరిగ్గా పోతే ఎంత ఆరోగ్యం కలుగుతుందో, నిద్ర సరిగ్గా పోకపోతే అంత డేంజరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర సరిగ్గా పోకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర సరిగ్గా పోకపోతే ఆ రోజంతా చిరాకుగా ఉంటుంది. ఏ పని చేయబుద్ది కాదు. బద్దకం ఆవహస్తుంది. ఉదయాన్నే శక్తి లేనట్లు అనిపిస్తుంది. ఏ పని చేయలేకపోతారు. చిన్న పనిచేసినా అలసిపోతారు. నీరసం వస్తుంది. ఎవరు పలకరించినా చిరాకు పడుతుంటారు. శరీర పనితీరు మందగిస్తుంది. పనులు చేయడంలో వెనుకబడతారు. నిద్ర లేమి వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది. మానసిక ఆరోగ్యం మందగిస్తుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేయదు. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.
నిద్రలేమి వల్ల అధికంగా బరువు పెరుగుతారు. స్థూలకాయం వచ్చేస్తుంది. కొంత ఆహారం తీసుకున్నా చాలు, బరువు పెరుగుతారు. నిద్ర సరిగ్గా పోకపోతే ఏకాగ్రత ఉండదు. ఏ పనిపై ధ్యాస పెట్టలేరు. దృష్టి సారించలేదు. ఏ పని సరిగ్గా చేయలేకపోతారు. అలాగే ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
నిద్ర సరిగ్గాపోకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే జీవక్రియలు మందగిస్తాయి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవదు. ఫలితంగా అజీర్తి, గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజూ సరైన టైముకు నిద్రించాలి. రాత్రి వీలైనంత త్వరగా నిద్రించి ఉదయాన్నే లేవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగాలు రాకుండా ఉంటాయి.