Beeruva : సాధారణంగా చాలా మంది ఇళ్లలో బీరువా ఉంటుంది. బీరువాలో అనేక మంది రకరకాల వస్తువులను పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కేవలం కొన్ని వస్తువులను మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఏ వస్తువును పడితే దాన్ని బీరువాలో పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయి. సర్వం నాశనం అవుతుంది. తీవ్రమైన కష్టాల్లో పడిపోతారు. కనుక బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
బీరువాలో ఏ వస్తువును పడితే దాన్ని పెట్టరాదు. కేవలం డబ్బు, నగలు, బంగారం, ఇతర విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను మాత్రమే పెట్టుకోవాలి. ఏ వస్తువును పడితే దాన్ని పెడితే అంతా నాశనమే జరుగుతుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు వస్తాయి.
ఇక బీరువాను నైరుతి దిశలో ఉంచరాదు. దక్షిణం లేదా వాయువ్యం, ఉత్తర దిశల్లో ఉంచాలి. వాయువ్య దిశకు చంద్రుడు అధిపతి. ఉత్తర దిశకు బుధుడు అధిపతి. వీరు ఇంట్లోకి ధన ప్రవాహం జరిగేలా చూస్తారు. కనుక బీరువాను ఆయా దిశల్లో ఉంచితే మంచిది.
బీరువాపై ఒక వైపు స్వస్తిక్ గుర్తును వేయాలి. మరో వైపు పసుపు, కుంకుమ కలిపి బొట్టులా పెట్టాలి. ఇక బీరువాలో లక్ష్మీదేవి చిత్ర పటాలను లేదా బొమ్మలను పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏనుగు తొండం ఎత్తినట్లు ఉండే ఫొటోలను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. డబ్బుకు కష్టాలు లేకుండా చేస్తుంది.
అలాగే బీరువా తెరిచినప్పుడు సువాసన వెదజల్లేలా ఏదైనా పెట్టాలి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు పోతాయి. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.