Eggless Chocolate Banana Bread : ఎగ్ లెస్ చాక్లెట్ బనానా బ్రెడ్.. కోడిగుడ్లు వేయకుండా చేసే ఈ బ్రెడ్ చాలారుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా బేకరీలల్లో లభిస్తూ ఉంటుంది. ఈ బ్రెడ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. కాఫీతో తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ బ్రెడ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు ఈ కూడా ఈ బ్రెడ్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఎగ్ లెస్ చాక్లెట్ బనానా బ్రెడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ లెస్ చాక్లెట్ బనానా బ్రెడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాగా పండిన అరటిపండ్లు – 4, పంచదార పొడి – ఒక కప్పు, రిఫైండ్ నూనె – అర కప్పు, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్, మైదాపిండి – ఒక కప్పు, బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్, వంటసోడా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూన్, చాక్లెట్ చిప్స్ – అర కప్పు.
ఎగ్ లెస్ చాక్లెట్ బనానా బ్రెడ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అరటిపండ్లను తీసుకోవాలి. తరువాత పంచదార పొడి వేసి గంటెతో మెత్తగా చేసుకోవాలి. తరువాత నూనె, వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. తరువాత మైదాపిండి, వంటసోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. దీనిని కట్ అండ్ ఫోల్డ్ పద్దతిలో అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత చాకో చిప్స్ వేసి కలపాలి. తరువాత బ్రెడ్ ట్రేను తీసుకుని అందులో బటర్ పేపర్ ను ఉంచాలి. తరువాత దీనిలో ముప్పావు వంతు బ్రెడ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత ఈ ట్రేను ఫ్రీహీట్ చేసుకున్న ఒవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 40 నిమిషాల పాటు బేక్ చేసుకుని బయటకు తీయాలి. దీనిని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచి ఆ తరువాత ప్లేట్ లోకి తీసుకుని కావల్సిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ లెస్ చాక్లెట్ బనానా బ్రెడ్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.